యజమాని ప్రాణాలు కాపాడిన శునకం.. ఎలాగంటే..?!

ఎన్నో శతాబ్దాల నుంచి అన్ని జంతువుల కంటే మనుషులకు శునకాలే మంచి స్నేహితులుగా మెలుగుతున్నాయి.కొందరు యజమానులు తమ శునకాలను కన్నబిడ్డలవలె కంటికి రెప్పలా కాపాడుతుంటారు.

 A Brave Dog Saves Life Of Its Owner By Alerting The Neighbors In America-TeluguStop.com

అయితే శునకాలు కూడా తమ యజమానుల పట్ల అమితమైన ప్రేమను కురిపిస్తుంటాయి.తమ యజమానుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి ప్రతి శునకం కూడా సిద్ధమౌతుంది.

బంధుమిత్రుల కంటే శునకాల్లోనే ఎక్కువగా మానవత్వం ఉందని ఎన్నో సందర్భాల్లో నిరూపితమయింది.ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని కుక్కలు తమ యజమానుల ప్రాణాలను కాపాడిన ఘటనలకు సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం.

 A Brave Dog Saves Life Of Its Owner By Alerting The Neighbors In America-యజమాని ప్రాణాలు కాపాడిన శునకం.. ఎలాగంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాస్తవానికి ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట కుక్కలు మనుషులను కాపాడినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే తాజాగా కుక్కల యొక్క గొప్పతనాన్ని చాటే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది.

ఓ యజమాని తన కుక్కను తనతో పాటే వాకింగ్ కి తీసుకెళ్ళాడు.అయితే వాకింగ్ చేస్తున్న సమయంలో అతడు హఠాత్తుగా కిందపడిపోయి ఊపిరాడక గిలగిల కొట్టుకున్నాడు.

తన యజమాని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.కంగారు పడిపోయిన అతడి కుక్క వెంటనే పక్కనే ఉన్న ఇంటికి వెళ్లి గట్టిగా మొరిగింది.

దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కొందరు తమ ఇంటి ముందే కింద పడిపోయి మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న ఆ కుక్క యజమానిని గమనించారు.ఆపై 911(అమెరికాలో ఎమర్జెన్సీ నెంబరు)కు సమాచారమిచ్చారు.

దీనితో వైద్య సిబ్బందితో పాటు ఫైర్, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకొని అతడికి హుటాహుటిన చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.

ఐతే యజమాని ప్రాణాలను కాపాడటంలో చురుకుగా స్పందించిన ఈ కుక్కని పోలీసు అధికారులు పొగుడుతున్నారు.

అంతేకాకుండా ఆ శునకం ఫోటోతో పాటు అది తన యజమాని ప్రాణాలు కాపాడిన కథనాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.కాగా, ఈ ఫేస్‌బుక్‌ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఒక మనిషి ప్రాణాలను కాపాడిన ఈ కుక్క ని పొగడడం తో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించారు.దీంతో నెటిజన్లు పోలీస్ అధికారులను ప్రశంసిస్తున్నారు.

#Netizens #America #Dog Owner #Police Officers #Walking

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు