జెయింట్ వీల్‌పై డేంజరస్‌ స్టంట్ చేసిన బాయ్.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువత పిచ్చి పనులు చేస్తుంటారు.ఒక్కోసారి వీరి స్టంట్స్ చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది.

 A Boy Who Did A Dangerous Stunt On A Giant Wheel The Video Is Viral , Giant Whee-TeluguStop.com

తాజాగా అలాంటి భయంకరమైన స్టంట్‌ను కొందరు కుర్రాళ్లు చేశారు.తమిళనాడులోని చెంగల్పట్టులో ఉన్న ఒక జెయింట్ వీల్‌కు కొందరు అబ్బాయిలు ప్రమాదకరస్థాయిలో వేలాడారు.

ఇటీవల ఈ ప్రాంతంలో ఒక జాతర జరిగింది.కాగా చాలామంది జెయింట్ వీల్ వంటి థ్రిల్లింగ్ రైడ్స్ ఆస్వాదించేందుకు ఇక్కడికి వచ్చారు.

అయితే కొందరు అబ్బాయిలు జెయింట్ వీల్ నుంచి ప్రమాదకరంగా వేలాడుతూ అక్కడ ఉన్న వారందరికీ హడల్ పుట్టించారు.దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.కొంచెం అటూ ఇటూ అయినా వీరు కింద పడి చని పోయే ప్రమాదం లేకపోలేదు.

ఆ ప్రమాదాన్ని వీరు లెక్కచేయకుండా పిచ్చి పనులు చేసే అందరినీ ఆగ్రహానికి గురి చేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో.

జెయింట్ వీల్ ఫుల్ స్పీడ్‌గా తిరుగుతున్నప్పుడు చాలా మంది యువకులు దానికి వేలాడుతూ కనిపించారు.జాతరకు హాజరైన ప్రజలు ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం చూసి ఉలిక్కిపడ్డారు.

అనంతరం కొందరు పోలీసులకు సమాచారం అందించారు.దాంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరిని పట్టుకున్నారు.

అయితే వారిని జైలుకి పంపించకుండా సింపుల్ వార్నింగ్‌ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు.అయితే ఈ వీడియో చూసి ఆనందించండి ఇలాంటి ఆకతాయిలను నాలుగు రోజులు జైల్లో కుమ్మితే.

మళ్లీ ఇలాంటివి ఎప్పుడూ చేయరు అని కామెంట్స్‌ చేస్తున్నారు.గతంలో కూడా వేరే వారు ఇలాంటి స్టంట్స్ చేసి అందర్నీ భయపెట్టిన సందర్భాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube