అమ్మాయిల బాత్రూమ్ లోకి వెళ్లిన అబ్బాయి.. అందులో ఉన్న అమ్మాయి ఏం చేసిందో తెలుసా...  

A Boy Went Into A Girls Toilet-

అమెరికా లో ఈ మధ్య అక్కడి న్యాయస్థానాలలో వింత కేసు లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఒక స్కూల్ లో చదువుకుంటున్న యువకుడు ఆడే స్కూల్ లో ఉన్న అమ్మాయిల బాత్రూం లోకి దూరడు , దీనికి ఒక కారణం కూడా ఉంది , చివరికి ఏమైందో తెలుసా. అసలు విషయం ఇదే..

అమ్మాయిల బాత్రూమ్ లోకి వెళ్లిన అబ్బాయి.. అందులో ఉన్న అమ్మాయి ఏం చేసిందో తెలుసా...-A Boy Went Into A Girls Toilet

అమెరికా లోని అలస్కా నగరానికి చెందిన ఒక స్కూల్ లో అబ్బాయిలు , అమ్మాయిలతో పాటు ట్రాన్స్ జెండర్ లు కూడా చదువుకుంటున్నారు.

అక్కడ చదువుకుంటున్న ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు ప్రత్యేకంగా బాత్రూమ్ లు లేవు అందువల్ల ఒక ట్రాన్స్ జెండర్ విద్యార్థి మగవారి బాత్రూమ్ కి వెళ్ళింది , అందులో నుండి వచ్చేటప్పుడు తను ఒక సెల్ఫీ ని తీసుకుంది.దానిని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.చదువుకుంటున్న మగ స్నేహితులు ఈ పోస్ట్‌ను చూసి కోపం తెచ్చుకున్నారు.

ట్రాన్స్‌జెండర్ తమ బాత్రూమ్ ను ఎలా వాడుకుంటుంది అని ఆవేశం తో రెచ్చిపోయి , వారు కూడా ఆడవారి బాత్రూమ్ లోకి వెళ్లి సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయాలని అనుకున్నారు.

ఆ స్కూల్ లో చదువుతున్న కొంత మంది మగ విద్యార్థులు కలిసి అమ్మాయిల బాత్రూమ్ దగ్గరికి వెళ్లారు. అందులో నుండి ఒక అబ్బాయి లేడీస్ బాత్రూమ్ లోకి వెళ్లగా మిగితా వారు బాత్రూమ్ బయట నిరాశ తెలిపారు. అయితే బాత్రూమ్ లోకి వెళ్లిన అబ్బాయి సెల్ఫీ తీసుకుంటుండగా ఆ బాత్రూమ్ లో అతని కంటే ముందే వెళ్లిన అమ్మాయి ఉంది , ఆమె అతడు లోపలికి ఎందుకు వచ్చాడో తెలియక అతడి పైన దాడి చేస్తూ మోకాలుతో అతని మర్మంగంపై కొట్టింది.

దీంతో బయట ఉన్న విద్యార్థులు నిరసన ఆపేసి తమ స్నేహితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కూలు యాజమాన్యానికి ఈ విషయం తెలియడంతో యువతిని సస్పెండ్ చేశారు..

అయితే విద్యార్థినిని సస్పెండ్ చేయడం అన్యాయమంటూ నార్త్ పోల్ స్టేట్ రిప్రజెంటెటివ్ ట్యామీ విల్సన్ ఆరోపించారు.

యువతి తనను రక్షించుకోడానికి ఈ పని చేసిందని ఆ స్థానంలో తన కూతురు ఉన్నా ఇదే చేసేదని యువతిని కొనియాడారు. అబ్బాయి బాత్‌రూంలో ఎందుకు ఉన్నాడన్నది తనకు అనవసరం అని యువతి చేసిన పనిలో మాత్రం ఏ తప్పు లేదంటూ వివరించారు. కాగా, ఈ కేసు విద్యార్థి, విద్యార్థిని నుంచి ట్రాన్స్‌జెండర్స్ హక్కుల వైపు మళ్లింది.

ఈ వార్త దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు ట్రాన్స్‌జెండర్స్ కోసం ప్రత్యేక బాత్‌రూంలు ఏర్పాటు చేయాలంటూ నిరసన తెలుపుతున్నారు. ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా ప్రత్యేక హక్కులు ఉండేలా బిల్లును రూపొందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.