కెమెరాని ఇలాగకూడ ఉపయోగించొచ్చా... వైరల్ అవుతున్న వీడియో

డ్రాగన్ కంట్రీ చైనా ఫోన్స్ అంటే అందరికీ మంచి క్రేజ్.చైనా బ్రాండ్ ఫోన్స్ అంటే ఒక్క భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో గిరాకీ ఉంది అని చెప్పాలి.

 A Boy Opening A Beer Bottle With One Pop Up Camera-TeluguStop.com

చైనా ఫోన్స్ అయిన వన్ ప్లస్,వివో,ఒప్పో,కూల్ ప్యాడ్ ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని కూడా ప్రపంచ మార్కెట్ లో మంచిగా క్లిక్ అయ్యాయి.అయితే త్వరలో వన్ ప్లస్ 7 ప్రో ఫోన్ అందుబాటులోకి రానుంది.

అయితే ఈ ఫోన్ లో ప్రత్యేకత ఏమిటంటే పాప్-అప్ కెమెరా ఫీచర్.కెమెరా తో కేవలం ఫోటోలు మాత్రమే తీసుకుంటారు అని తెలుసు కానీ ఈ పాప్-అప్ కెమెరా ఉపయోగించి ఒక కుర్రాడు చేసిన ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది.

వన్‌ప్లస్ 7ప్రొ పాప్-ఆప్ కెమెరాను ఓ యువకుడు ఫొటోలకు కాకుండా బీర్ బాటిల్ మూత ఓపెన్ చేయడానికి ఉపయోగించాడు.నిజంగా ఇది నిజమేనండీ ఒక యువకుడు ఈ పాప్-అప్ కెమెరా ను ఉపయోగించి బీర్ బాటిల్ మూత తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అయితే బీర్ బాటిల్ ఓపెన్ చేసినా ఫోన్ కు ఎలాంటి డ్యామేజ్ కూడా ఏర్పడలేదు.సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఈ ఒక్క వీడియో కు ఏకంగా 1,66,000 వ్యూస్ లభించడం విశేషం.

ఇక ఇప్పుడు ఈ ఫోన్ ను ప్రతి యువకుడు కొనుక్కుంటాడేమో.ఎందుకంటే పార్టీ టైం లో ఓపెనర్ తో సంబంధం లేకుండా బీర్ బాటిల్స్ ని ఈజీ గా ఓపెన్ చెయ్యొచ్చు కదా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube