విద్యార్థికి తేలు కుట్టింది అని ప్రధానోపాధ్యాయుడు చేసిన పనికి ఆశ్చర్యపోవాల్సిందే  

A Boy Fro Up Forced To Sweep School Gets Stung By Scorpion.-

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్న సామెత గుర్తు ఉండే ఉంటుంది.ఒక విష జీవి కుట్టినప్పుడు మంత్రాలతో ఆ విషం కు విరుగుడు దొరుకుతుందా అంటే ఎవరైనా ఏమి చెబుతారు.మూఢనమ్మకాలు ఉన్న వ్యక్తులు మాత్రం ఇంకా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మంత్రికుల పై ఆధారపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు...

A Boy Fro Up Forced To Sweep School Gets Stung By Scorpion.--A Boy Fro UP Forced To Sweep School Gets Stung By Scorpion.-

ఇలాంటి విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.యూపీ లోని ఝాన్సీ లోని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి కి తేలు కుట్టగా దానికి అతడు వెంటనే ఆసుపత్రికి తరలించాల్సింది పోయి మూఢ నమ్మకం తో మాంత్రికుడి చేత ఫోన్ లో మంత్రాలు వినిపించాడు.అయితే ఈ లోపే ఆ విద్యార్థి శరీరం అంతా కూడా పాయిజన్ పాకడం తో అతడు మృతి చెందినట్లు తెలుస్తుంది.

బుధవారం యూపీ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే….యూపీలో పాఠశాలలు ఇటీవలే పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లడం ప్రారంభించారు.అయితే బుధవారం పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను ఆదేశించడం తో విద్యార్థులు ఆ పని లో నిమగ్నమయ్యారు.

A Boy Fro Up Forced To Sweep School Gets Stung By Scorpion.--A Boy Fro UP Forced To Sweep School Gets Stung By Scorpion.-

అయితే ఇంతలో ఓ విద్యార్థి(10)కి తేలు కుట్టడం తో ఆ విద్యార్థి గిలగిల్లాడుతుండగా ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సింది పోయి ఒక మాంత్రికుడి ఇంటికి తరలించారు.అయితే ఇంటిలో మాంత్రికుడు లేకపోవడం తో అక్కడ నుంచి అయినా ఆసుపత్రికి తరలించకుండా ఆ మాంత్రికుడికి ఫోన్ చేసి విషయం చెప్పడం,దానికి ఆ మాంత్రికుడు మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు.అయితే ఈ మంత్రాలను బాధిత విద్యార్థి చెవి వద్ద ఫోన్ పెట్టి మరి వినిపించాడు.

కానీ మంట తగ్గలేదు దానితో అప్పటికి తేరుకున్న ఆయన ఆ తర్వాత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.

కానీ ఎలాంటి ప్రయోజనం లేదు.మంట తో అల్లాడిన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.ఈ ఘటనపై రాష్ట్ర ఉన్నత విద్యా అధికారులు స్పందించారు.

ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయడమే కాకుండా ఈ ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది.ఈ 20 వ శతాబ్దం లో కూడా ఇలా మాయలు,మంత్రాలూ అంటూ నమ్ముకుంటూ ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.