పేదలకు వరం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం( Rajiv Arogyashri Scheme ) పేదలకు ఓ వరమని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( MLA Adi Srinivas ) అన్నారు.స్థానిక ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన గోడ పోస్టర్ ను వైద్యాధికారులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు రూ.10 లక్షల వైద్య సహాయం అందిస్తున్నామన్నారు .గతంలో ఐదు లక్షల వరకే ఆరోగ్య భీమా ఉండగా.ఇప్పుడు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఆ మొత్తాన్ని మా ప్రభుత్వం పది లక్షలకు పెంచిందన్నారు.

ఈ పథకం ద్వారా 1672 రకాల వ్యాధులకు వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని చెప్పారు.ఈ పథకం ద్వారా మెరుగైన సేవలందిస్తామని అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వైద్య వృత్తి పవిత్రమైనదని వైద్యులు నిరంతరం సేవాలందించాలని సూచించారు.

పదవి విరమణ పొందిన అధికారని సన్మానించి జ్ఞాపకం అందజేసిన ఎస్పీ..
Advertisement

Latest Rajanna Sircilla News