నా జీవితాన్ని బయోపిక్ తియ్యొచ్చు.. ఎన్నో మలుపులు ఉన్నాయ్: బండ్ల గణేష్

A Biopic Will Take My Life There Are Many Twists Saya Bandla Ganesh

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన పలు చిత్రాలలో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.

 A Biopic Will Take My Life There Are Many Twists Saya Bandla Ganesh-TeluguStop.com

అనంతరం నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు.ఇలా నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న బండ్లగణేష్ అనంతరం రాజకీయాలలోకి ప్రవేశించారు.

అయితే రాజకీయాలలో ఈయనకు పూర్తి వ్యతిరేకత ఏర్పడటంవల్ల కొన్ని రోజుల పాటు సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు దూరమయ్యారు.

 A Biopic Will Take My Life There Are Many Twists Saya Bandla Ganesh-నా జీవితాన్ని బయోపిక్ తియ్యొచ్చు.. ఎన్నో మలుపులు ఉన్నాయ్: బండ్ల గణేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బండ్లగణేష్ ఏ విధమైనటువంటి సినిమాలను నిర్మించలేదు తనకు సరైన కథ దొరికితే తప్పకుండా సినిమాలను నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నానని బండ్లగణేష్ వెల్లడించారు.

ఇక బండ్ల గణేష్ మెగా కుటుంబానికి వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే.ఇక ఈయన ఏ వేదిక పైకి వెళ్లిన లేదా సోషల్ మీడియా వేదికగా అయినా ఆయన మెగా కుటుంబం గురించి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ మెగా అభిమానులను సందడి చేస్తుంటారు.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Biopic, Krishna Vamshi, Raviteja, Pawan Kalyan, Tollywood-Movie

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన దేవుడు అంటూ ఈయన సంబోధించడంతోనే మెగా కుటుంబం పట్ల ఆయనకు ఏ విధమైనటువంటి అభిమానం ఉందో అర్థమవుతుంది.ఈ క్రమంలోనే మెగా కుటుంబానికి సంబంధించిన సినిమాల గురించి లేదా సామాజిక అంశాల గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బండ్ల గణేష్ కొన్నిసార్లు దారుణంగా ట్రోలింగ్ కి గురవుతారు.అలాగే ఈయన గతంలో హీరో రవితేజ డైరెక్టర్ కృష్ణ వంశీని భూముల విషయంలో దారుణంగా మోసం చేశారని వార్తలు కూడా వినబడుతున్నాయి.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Biopic, Krishna Vamshi, Raviteja, Pawan Kalyan, Tollywood-Movie

తాజాగా ఈ వార్తలపై స్పందించిన బండ్లగణేష్ తను ఎవరిని మోసం చేయలేదు అని నేను వారికి భూములు అమ్మినప్పుడు వారు వేరే వారికి అమ్ముకొని వ్యాపారం చేశామే తప్ప ఎవరినీ మోసం చేయలేదని వెల్లడించారు.కేవలం తన అంటే గిట్టని వారు మాత్రమే ఈ విధమైనటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని అంతే కానీ నాకు ఎవరితో ఏ విధమైనటువంటి శత్రుత్వం లేదని, ఎవరిని మోసం చేయలేదని బండ్ల గణేష్ తెలిపారు.ఇక తనకు సినిమా ఒకటే జీవితం కాదని తెలిపిన బండ్లగణేష్ తన జీవితంలో సినిమా ఒక చిన్న భాగమని తెలిపారు.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Biopic, Krishna Vamshi, Raviteja, Pawan Kalyan, Tollywood-Movie

అయితే తన తర్వాతి సినిమా ఎప్పుడూ ఉంటుందన్న విషయం గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ.ఇప్పుడు తను ఎలాంటి సినిమాలు చేయలేదని సరైన కథ దొరికినప్పుడు ఆ కథకు అనుగుణంగా ఉన్న హీరోలతో తప్పకుండా సినిమా చేస్తానని ప్రకటించారు.ఇక ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి.ఎన్టీఆర్ జయలలిత వంటి వారి బయోపిక్ చిత్రాలను తెరకెక్కించారు.ఈ క్రమంలోనే నా జీవితాన్ని కూడా ఒక బయోపిక్ తీయవచ్చని నా జీవితంలో కూడా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయని ఈ సందర్భంగా బండ్ల గణేష్ తన జీవితం గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు.

#Raviteja #Pawan Kalyan #BandlaGanesh #Bandla Ganesh #Biopic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube