ప్రేమలో పడ్డ ప్రేమికులు అవుతలి వారిని ఇంప్రెస్ చేసేందుకు ఎలాంటి సాహసాలు అయినా చేసేందుకు వెనుకాడరు.అచ్చం ఇలాగే తాజాగా ఒక అమ్మాయికి ఆ ప్రియుడు ఇచ్చిన బహుమతి అందరినీ ఆశ్యర్యపరచడంతో దెబ్బకి, వారం తిరగకముందే ఆ ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంతకీ ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసే అంత బహుమతి ఏమిటి అని అనుకుంటున్నారా.? ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసే క్రమంలో పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రియుడు ఆమెకు ఒక ఒంటె ను బహుమతిగా ఇచ్చాడు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.దుబాయ్ కు చెందిన ఒక ప్రేమికుడు తన ప్రియురాలి కోసం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఒక ఒంటెను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.
అనుకున్న వెంటనే ఓ అరుదైన జాతికి చెందిన ఒంటె ను దొంగలించి బహుమతిగా బహూకరించాడు.ముందుగా తల్లి ఒంటె ను దొంగిలించడానికి ప్రయత్నించగా ఆ సమయంలో ఇరుగు పొరుగు వారు అక్కడికి రావడంతో ఆ పనికి కాస్తా అడ్డు తగిలింది.
అనంతరం మళ్లీ అదే ఇంటికి వెళ్లి తల్లి ఒంటె పిల్లను దొంగలించి ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉంచాడు.ఇక తప్పిపోయిన ఒంటె పిల్ల కోసం నాలుగు రోజుల పాటు వెతికిన దొరకకపోవడంతో యజమాని చివరికి పోలీసులను ఆశ్రయించారు.అలాగే తమ ఒంటెను ఎత్తుకపోవడానికి ఒక యువకుడు ప్రయత్నించాడని తెలుపగా.వెంటనే అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.దాంతో పోలీసుల విచారణలో భాగంగా అసలు నిజం బయట పెట్టాడు నిందితుడు.దీంతో వెంటనే ఆ ఒంటె ను స్వాధీనం చేసుకొని సదరు యజమానికి అప్పగించారు.
ఏదిఏమైనా ఇంత పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకొని చివరకి జైలు పాలవల్సి వచ్చింది.