టీటీడీ ఈవో ఆక‌స్మిక బ‌దిలీ వెన‌క అంత క‌థ న‌డిచిందా...!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.ఇటీవ‌ల త‌ర‌చుగా వార్త‌ల్లోకి వ‌స్తోంది.మ‌రీముఖ్యంగా గ‌త వారంలో జ‌రిగిన బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా.సీఎం జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌నే వాద‌న మ‌రింత‌గా తెర‌మీదికి వ‌చ్చింది.దీంతో ఇదే అదునుగా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు.మాజీ సీఎం చంద్ర‌బాబు.

 A Big Story Behind Ttd Eo Transfer Matter, Ttd, Tirumula Tirupathi Devasthanams,-TeluguStop.com

ఏకంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపు ఇచ్చారు.ఇది తీవ్ర వివాదంగా మారింది.

మ‌రోప‌క్క తిరుమ‌ల గిరుల‌పై అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రుగుతోంద‌నే వాద‌న ఎప్ప‌టి నుంచో ఉంది.ఇలా అనేక వివాదాలు ఎప్పుడూ తిరుమ‌ల‌ను చుట్టుముడుతూనే ఉన్నాయి.

అయితే.తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్  ను ఆక‌స్మికంగా బ‌దిలీ చేయ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.వాస్త‌వానికి బ‌దిలీ అనేది ప్రభుత్వ నిర్ణ‌య‌మే అయిన‌ప్ప‌టికీ.సింఘాల్ విష‌యంలో అనూహ్యంగా తీసుకున్న నిర్ణ‌యం మ‌రింత ఆస‌క్తిగా మారింది.

దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.డిక్ల‌రేష‌న్‌పై వివాదం చెల‌రేగిన‌ప్పుడు.

దీనిని అధికారికంగా స‌మ‌ర్థంగా తిప్పికొట్ట‌డంలో ఆయ‌న మౌనం పాటించారు.ఆది నుంచి కూడా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండే సింఘాల్‌.

త‌న ప‌ని తాను చేసుకునిపోవ‌డ‌మే త‌ప్ప మ‌రో విష‌యాల జోలికిపోరు.కానీ, తాజాగా తెర‌మీదికి వ‌చ్చిన డిక్ల‌రేష‌న్ వివాదంపై కూడా ఆయ‌న మౌనం పాటించ‌డం సీఎం ఆగ్ర‌హానికి గురికావాల్సి వ‌చ్చింద‌ని వైసీపీ నేత‌ల చ‌ర్చ‌.

మ‌రో కీల‌క విష‌యం.బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను సంపూర్ణంగా ఆయ‌న అమ‌లు చేయ‌లేద‌ని విమ‌ర్శ‌.ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు మంత్రుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.దేవా‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌, మ‌రో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ‌ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

దీంతో ఈ ప‌రిణామాన్ని సీఎం సీరియ‌స్‌గా భావించార‌ని, బ్ర‌హ్మోత్సవాల స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారో నివేదిక తెప్పించుకుని చ‌ర్య‌లు తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.ఏదేమైనా.

టీటీడీ ఈవో ఆక‌స్మిక బ‌దిలీ వెనుక రాజ‌కీయ కార‌ణాలు చాలానే ఉన్నాయ‌ని వైసీపీ నాయ‌కులే భావిస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube