అమెజాన్ ప్రైమ్ కి బిగ్ షాక్... ఇపుడు ఏం చేస్తుందో చూడాలి మరి?

ఇక్కడ అమెజాన్ ప్రైమ్ అంటే ఏమిటో తెలియని జనాలు ఉండనే వుండరు.నేడు ప్రపంచాన్ని శాసిస్తోన్న OTTలలో అమెజాన్ ప్రైమ్ ఒకటి.

 A Big Shock To Amazon Prime What Will It Do Now Amazon Prime, Members, Shock, Technology Updates, Technology News , Hot Star-TeluguStop.com

బేసిగ్గా ఏదైనా సినిమా OTTకి అమ్మినపుడు దాని హక్కులు శాశ్వతంగా ఉంటాయనుకుంటారు కానీ ఈ ఒప్పందాలకు కూడా కాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది.అది దాటాక తిరిగి రెన్యూవల్ చేసుకోవడమో లేక, అతను అడిగిన మొత్తాన్ని ఇవ్వడమో చేయాలి.

ఒక్కోసారి వీటి ప్రభావం గట్టిగానే ఉంటుంది.అమెజాన్ ప్రైమ్ లో సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

 A Big Shock To Amazon Prime What Will It Do Now Amazon Prime, Members, Shock, Technology Updates, Technology News , Hot Star-అమెజాన్ ప్రైమ్ కి బిగ్ షాక్#8230; ఇపుడు ఏం చేస్తుందో చూడాలి మరి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక వీటిని పదే పదే చూసే నోస్టాల్జియా ఫ్యాన్స్ వందల కోట్లలో వున్నారని వినికిడి.ఇక్కడే వచ్చింది అసలు చిక్కు.మరి ఆయా సినిమాలకు వారు రెన్యూవల్ చేయలేదేమో గాని, ఇంకో పది రోజుల్లో ఇవి ప్రైమ్ నుంచి తొలగించబడుతున్నాయి.అందులో దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, రబ్ నే బనా ది జోడి, చక్ దే ఇండియా, దిల్ తో పాగల్ హై, మొహబత్తే, జబ్ తక్ హై జాన్, డర్, లమ్హే, సిల్సిలా, బ్యాండ్ బాజా బారాత్, ఫనా, సలాం నమస్తే, ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3, గుండే, కభీ కభీ, కాలా పత్తర్, దాగ్, సాథియా, ఏ ధిల్లగి, విజయ్, మషాల్ లాంటి ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ వున్నాయి.

Telugu Amazon Prime, Shock, Ups-Latest News - Telugu

ఇక ఈ సినిమాలు చూడటం కోసమే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకు ఇది తీవ్ర నిరాశ చెందాల్సిన వార్తగా చెప్పుకోవచ్చు.అవును, అక్టోబర్ 1 నుంచి అవి డిలీట్ అవ్వబోతున్నాయి.తర్వాత హాట్ స్టార్ లో రావొచ్చనే టాక్ ఉంది కానీ ప్రస్తుతానికి అయితే అధికారిక ప్రకటన ఏది లేదు.టాలీవుడ్ లోనూ ఇలా గంపగుత్తగా పేరుమోసిన బ్యానర్లు తమ క్లాసిక్స్ ని కొన్ని ఓటిటిలకు, శాటిలైట్ ఛానల్స్ కు ఎక్కువ కాలానికి హక్కులు ఇచ్చేశారు.

భవిష్యత్తులో టైం ఎక్స్ ఫైర్ అయినప్పుడు అభిమానులు ఇలాంటి వాటికి ముందే ప్రిపేర్ అవ్వాలి మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube