వైరల్ వీడియో: వాహనాన్ని ఈడ్చుకుపోయిన పెద్ద పులి..!  

a bengal tiger is afried people at safari, big tiger, Bangalore, bannerugattu, safari - Telugu Bangalore, Bannerugattu, Big Tiger, Safari

ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం.సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ప్రపంచానికి ఇట్లే క్షణాలలో తెలిసిపోతోంది.

TeluguStop.com - A Bengal Tiger Is Afried People At Safari

ఇదిలా ఉండగా తాజాగా బెంగళూరు నగరంలో జరిగిన ఓ సంఘటన తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

బెంగళూరు మహానగరానికి శివార్లలో ఉన్న బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ లో ఓ సంఘటన జరిగింది.పార్కులో ఉన్న అడివి ప్రాంతంలో ఓ బెంగాల్ టైగర్ సఫారీకి వచ్చిన వాహనాన్ని నోటితో లాక్కొని పోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TeluguStop.com - వైరల్ వీడియో: వాహనాన్ని ఈడ్చుకుపోయిన పెద్ద పులి..-General-Telugu-Telugu Tollywood Photo Image

సఫారీ చేయడానికి ఓ వాహనంలో టూరిస్టులు పార్కు లోకి వచ్చారు.అలా వచ్చిన టూరిస్టులు రెండు పులులు ఉన్న వైపు వారు వెళ్ళారు.అయితే అక్కడ వారు కొద్దిసేపు వాహనాలు ఆపి వాటిని చూస్తూ ఉన్న సమయంలో ఓ పెద్దపులి వారు ఉన్న కారు దగ్గరకు వచ్చింది.అయితే అనుకోకుండా ఆ పెద్దపులి ఉన్నట్టుండి ఒక్కసారిగా కారు వెనుక ప్రాంతంలో ఉన్న కారు బంపర్ ను నోటితో పట్టేసుకుంది.

ఆ బంపర్ ను అటు ఇటు లాగి వాహన బంపర్ ను పూర్తిగా పాడు చేసింది.

పెద్దపులి ఇలా చేస్తున్న సమయంలో.

అదే సమయానికి మరో కారులో వచ్చిన వారు ఈ తతంగాన్ని మొత్తం వీడియోలో బంధించారు.అలా ఆ పెద్దపులి ఆ బంపర్ ని నోటితో పట్టుకొని అమాంతంగా ఆ కార్ ను వెనక్కి లాగడం మొదలు పెట్టింది.

నోటితో ఆ కారుని గట్టిగా వెనక్కి లాగడంతో ఆ వాహనంలోని ఉన్న వారు భయబ్రాంతులకు లోనయ్యారు.ఇలాగే ఉంటే కష్టం అవుతుందని భావించి ఆ వాహనం లోని వ్యక్తులు గట్టిగా కేకలు వేయడంతో దాంతో అక్కడి నుంచి ఆ పెద్ద పులి చిత్తగించింది.

#Bannerugattu #Big Tiger #Bangalore #Safari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు