ప్రపంచం మారుతోంది.మునిపటి కంటే భిన్నంగా ఉంటోంది.
దానికి తగ్గట్టే మనుషులు కూడా అప్డేట్ అవుతున్నారు.ఇటీవల కాలంలో అంతా డిజిటల్‌కు అలవాటు పడ్డారు.
అందువల్ల చేతిలో డబ్బులు లేకపోయినా చకచకా డిజిటల్ పేమెంట్లు చేసేస్తున్నారు.అందుకే ప్రస్తుతం బయటకెళ్లినప్పుడు ఎవరూ పర్సు పట్టుకెళ్లడం లేదు.
డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటివి వినియోగిస్తున్నారు.దీని వల్ల చాలా మంది యాచకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వారికి ఎవరూ చిల్లర వేయడం లేదు.దీంతో యాచకులు కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు.
ఫోన్ పే వంటి క్యూ ఆర్ కోడ్‌తో కూడిన బోర్డులను మెడలో వేసుకుంటున్నారు.ఫలితంగా ఇతరుల నుంచి సాయం పొందుతున్నారు.
ఇదే కోవలో ఓ యాచకుడు పలువురిని ఆకర్షిస్తున్నాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో గోపిరెడ్డి అనే యాచకుడు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాడు.వయసు మీద పడడంతో అడుక్కోవడం కష్టమవుతుంది.దీన్ని గ్రహించిన ఆ వ్యక్తి ప్రస్తుతం ఓ టీవీఎస్ మోపెడ్ కొనుక్కున్నాడు.దానిపై అటూ ఇటూ తిరుగుతూ యాచిస్తున్నాడు.
అంతేకాకుండా ప్రతీసారి అమ్మా.బాబూ.
ధర్మం చేయండి అని అడగడం కూడా అతడికి కష్టమైంది.దీంతో ఆ యాచిస్తున్న మాటలను అతడు రికార్డ్ చేశాడు.
ప్రస్తుతం మైక్‌లో వచ్చే ఆ యాచిస్తున్న ఆడియోతో మోపెడ్‌పై తిరుగుతూ అడుక్కుంటున్నాడు.ఇది ఆ ప్రాంతంలో అందరినీ ఆకర్షిస్తోంది.
పలువురు అతడిని మెచ్చుకుంటూ డబ్బులు దానం చేస్తున్నారు.ఏదేమైనా ఆ ప్రాంతంలో తన కొత్త ట్రెండ్‌తో యాచకుడు గోపిరెడ్డి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.