ఆలోచన అదుర్స్: టాక్సీలా మారిన యుద్ధ ట్యాంక్..!

A Battle Tank Turned Into A Taxi

ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా ట్యాక్సీ, ట్యాక్సీ.ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ట్యాక్సీలతో వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమే ఉంది.

 A Battle Tank Turned Into A Taxi-TeluguStop.com

అయినా కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి వస్తూనే ఉన్నారు.కానీ ఇటువంటి పరిస్థితుల్లో నిలదొక్కుకోవడం కొంచెం కష్టమే అయినా కొత్తగా, వినూతనంగా ఆలోచించగలిగితే కొంతవరకు నిలదొక్కుకోవచ్చు.

ఇలాగే ఆలోచించాడు ఓ ట్యాక్సీ డ్రైవర్. విటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని ఓ సరికొత్త ఆలోచనతో కొత్త ట్యాక్సీ ని ప్రారంభించబోతున్నాడు.

 A Battle Tank Turned Into A Taxi-ఆలోచన అదుర్స్: టాక్సీలా మారిన యుద్ధ ట్యాంక్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బ్రిటిష్ ట్యాక్సీ డ్రైవర్ మార్లిన్ యుద్ధ ట్యాంకును ట్యాక్సీ గా మార్చేశాడు.దానికోసం 1967 లో వినియోగించిన ఒక సైనిక వాహనాన్ని గత ఏడాది ఆన్లైన్లో కొనుగోలు చేసాడు.

అంతకుముందు నాలుగు దశాబ్దాలుగా ఒకరి ఇంట్లో నిరుపయోగంగా పడి ఉండడంతో అతనికి ఈ ఆలోచన వచ్చిందంట.అనుకున్నదే తడువుగా గతంలో బ్రిటిష్ ఆర్మి వాడిన యుద్ధ ట్యాంకును దాదాపు రూ.20 లక్షలు పెట్టి కొనుగోలు చేసాడు.

ప్రస్తుతం మెర్లిన్ యుద్ధ ట్యాంకును ట్యాక్సీ గా నడపడానికి అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.అయితే ప్రస్తుతం వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు మాత్రమే ప్రయాణికులను తీసుకు వెళ్ళడానికి లైసెన్స్ ఉందని, ఒక్కో ట్రిప్పుకు దాదాపు రూ.75,000 వసూలు చేస్తున్నట్టు మెర్లిన్ చెప్పుకొచ్చాడు.ఇంకా ఈ ట్యాంక్ లో సీటింగ్, టీవీ, స్టవ్ తో సహా అన్ని  సౌకర్యాలు ఉన్నాయని, ఈ ట్యాంకులో ఒకేసారి 9 మంది ప్రయాణికులు కూర్చోవచ్చని తెలిపారు.

అయితే ఇది ట్యాంకు కాదని, సాయుధ వ్యక్తిగత క్యారీయర్ అని, ఇది ట్యాక్సీ అంత సున్నితంగా ఉండకపోయినా ప్రయాణం చేసేటప్పుడు ఒక కొత్త, భిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పాడు.

రోడ్డు పైన ఈ వాహనం వెళ్తుంటే ప్రజలు శ్రద్ధగా చూస్తూ , నవ్వుతూ, ఈలలు వేస్తూ ఉంటారని చెప్పారు.అయితే మెర్లిన్ ప్రస్తుతం హోండా సివిక్ ను ట్యాక్సీ గా ఉపయోగిస్తున్నాడు.

#Taxi #Tank

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube