ఒక్క అరటిపండు,ప్లాస్టర్ తో కళాఖండం, రికార్డ్ స్థాయి పలికిన ధర  

A Banana Taped To A Wall Is Selling For 85 Lakhs-art Gallary,banana,italiyan Painter Paint The Bananna Wall,miyami Beach,paint In Bananna Wall

ఒక అరటిపండు ధర 85 లక్షలు పలికింది.నిజంగా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది మాత్రం నిజం.

A Banana Taped To A Wall Is Selling For 85 Lakhs-art Gallary,banana,italiyan Painter Paint The Bananna Wall,miyami Beach,paint In Bananna Wall Telugu Viral News-A Banana Taped To Wall Is Selling For 85 Lakhs-Art Gallary Banana Italiyan Painter Paint The Bananna Miyami Beach In

ఒక్క అరటిపండు ధర ఇన్ని లక్షలు అంటే అదేదో ప్రత్యేకమైన పండు అని అనుకుంటున్నారేమో.మామూలు అరటిపండే ఇన్ని లక్షలు ధర పలికింది.

అసలు విషయం ఏంటి అని అనుకుంటున్నారా.వివరాల్లోకి వెళితే—- ‘కమెడియన్’ పేరుతో మౌరిజియో కాటలన్ అనే ఇటాలియన్ కళాకారుడు ఒక అరటి పండు ను టేపు సాయం తో గోడకు అంటించి,దానిని మియామి బీచ్ లో పారిస్ కు చెందిన ఒక ఆర్ట్ గ్యాలరీ ఫౌండేషన్ ప్రదర్శనకు ఉంచింది.

అంతే ఈ మామూలు అరటి పండుకు లక్షల్లో ధర చెల్లించి సొంతం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.ఈ మామూలు అరటి పండు కోసం 1,20,000 డాలర్లు చెల్లించి మరి సొంతం చేసుకున్నారు.

అయితే ఆ కళాఖండం లో ఎలాంటి అద్భుతం లేదు.కేవలం అక్కడి మార్కెట్ లో లభించే ఒక అరటి పండు, ఒక చిన్న ప్లాస్టర్ అంతే.

ఆ చిన్న పాటి వస్తువు ఇలా రికార్డ్ స్థాయిలో ధర పలకడం అందరూ ఆశ్చర్యపోయారు.ఈ కళాఖండాన్ని ధ్రువీకరిస్తూ ఒక సర్టిఫికెట్ కూడా అందిస్తుండడం విశేషం.

అంతేకాకుండా ఈ కళాఖండాన్ని సొంతం చేసుకున్న వారు ఆ అరటి పండు దిశ ను మార్చుకోవచ్చు అని నిర్వాహకులు తెలిపారు.

గత పదిహేను సంవత్సరాల్లో కాటలన్,కమెడియన్ పేరుతో కళా ఖండాలను రూపొందించడం ఇదే ప్రధమం.

ఇటీవల బ్రిటన్ లోని బ్లనియం ప్యాలెస్ లో ప్రదర్శనకు ఉంచిన బంగారు టాయిలెట్ చోరీ కి గురైన సంగతి తెలిసిందే.అయితే అది కూడా కాటలన్ రూపొందించినదే కావడం విశేషం.

తాజా వార్తలు