రామసేతుని పోలిన వంతెన-ఆసక్తికరమైన విషయాలు

మీరిప్పటివరకు ఎన్నో రకాల వంతెనలను చూసుంటారు.ఒక్కో వంతెనకి ఒక్కో విశేషం ఉండొచ్చు కాని.

 A Bamboo Bridge Over The Mekong River At Kampong Cham-TeluguStop.com

ఇప్పుడు మీరు చదవబోయే వంతెన చాలా ప్రత్యేకమైనది.రామాయణంలో రాముడు లంకలో ఉన్న సీతను తీసువచ్చేందుకు సముద్రంపై ‘రామసేతు’ నిర్మించాడని చెబుతుంటారు.

వీటి ఆనవాళ్లు కనిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి.ఇప్పుడు రామసేతుని పోలిన వంతెన ఒకటుంది.

దానికి సంభందించిన ఆసక్తికరమైన విషేషాలు.

రామసేతుని తలపించే వంతెన ఉన్నది ఎక్కడంటే కంబోడియాలో.

దీనిని కలపతో నిర్మిస్తారు.నిర్మిస్తారు ఏంటి.

నిర్మించారు అని కదా అని అనాలి అంటారా.ఈ వంతెనను ప్రతి ఏటా నిర్మిస్తారు.

వర్షాకాలానికి ముందు స్థానికులు ఈ వంతెనను ద్వంసం చేస్తూ ఉంటారు.ఈ సమయంలో నదికి వరదలు వస్తే ఆటకం కలుగుతుందని ఇలా చేస్తుంటారు.


ఈ వంతెన నిర్మాణం కోసం ఇక్కడి వారంతా కలపను భద్రపరుస్తుంటారు.వాతావరణ పరిస్థితులు అనుకూలం కాగానే వంతెనను పునర్నిర్మిస్తారు.ప్రతీ యేటా ఈ తంతు జరుగుతూనే ఉంటుంది.

3,300 అడుగుల పొడవున్న దీనిని 50 వేల వెదురు బొంగులతో నదిపైన నిర్మిస్తారు.ఇది అద్భుతమైన నిర్మాణాన్ని తలపిస్తుంది.

కలపతో నిర్మిస్తారంటే కేవలం ఆకర్షణ కోసమే అనుకుంటే పొరపాటు.

దీనినిచాలా దృడంగా నిర్మిస్తారు.ఎంత ధృడంగా నిర్మిస్తారంటే దీనిపై ట్రక్కులు సైతం సులభంగా ప్రయాణించగలుగుతాయి.

ఈ వంతెనను మెకాంగ్ నదిని దాటేందుకు నిర్మిస్తుంటారు.ఈ వంతెనపై వెళ్లాలంటే డబ్బు చెల్లించాలి.ఎంత అనుకుంటున్నారు కేవలం రెండు రూపాయలు మాత్రమే.అదే విదేశీ పర్యాటకులైతే ఇంకా అధిక మొత్తంలో చెల్లించాల్సివుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube