వైరల్: ఎస్పీ బాలు చాక్లెట్ విగ్రహం..!

గడిచిన 11 నెలలుగా కరోనా వైరస్ ప్రజలను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా వైరస్ బారినపడి అనేక మంది ప్రజలు, ప్రముఖులు మృత్యువాతపడ్డారు.

 A Bakery Designed A Sp Balu Chocolate,sp Balu, Chocolate, Bekari, Rajinikanth,sp-TeluguStop.com

ఇందులో సినీ అభిమానులలో ముఖ్యంగా అందరినీ విషాదంలోకి నెట్టిన వార్త ఏమిటంటే గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త.ఎస్పీ బాలు గారు కరోనా వైరస్ బారినపడి సెప్టెంబర్ 25న మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే.

ఇప్పటికీ కూడా ఎస్పీ బాలు గారిని తలుచుకొని వ్యక్తి లేరు అంటే నమ్మండి.

ఇది ఇలా ఉండగా తాజాగా పుదుచ్చేరిలోని ఒక బేకరీ సంస్థ వారు బాలు గారికి వినూత్న రీతిలో నివాళులు అర్పించారు.

వాస్తవానికి ఆ బేకరీ సంస్థ చాక్లెట్లతో ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసే సాంప్రదాయం ఉంది.ఇక తాజాగా ఎస్పీ బాలుకి నివాళులు అర్పించడం కోసం ఏకంగా 339 కేజీలు, 5అడుగుల 8 అంగుళాలు ఎత్తు ఉన్న చాక్లెట్ విగ్రహాన్ని ఆ బేకరీ వారు ఏర్పాటు చేశారు.

ఇక ప్రతి సంవత్సరం ఆ బేకరీ వారు పుదుచ్చేరిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో పలు రంగాలలో మంచి పేరు సంపాదించుకున్న ప్రముఖులను గుర్తు చేసుకోవడం కోసం చాక్లెట్ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని చాక్లెట్ తో మాత్రమే తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు.

ఇక ఈ విగ్రహం జనవరి 3 వరకు ప్రదర్శనలో ఉంచుతామని యజమాని రాజేంద్ర తెలిపారు.ఇక ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు ఏకంగా వారికి 161 గంటలు పట్టిందని పేర్కొన్నారు.

ఇక ఈ విగ్రహాన్ని చూసేందుకు వచ్చిన ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఆ బేకరీ యజమాని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే కోయంబత్తూర్ సిరితుళి అనే స్వచ్ఛంద సంస్థ ఎస్‌పీబీ వనం పేరుతో నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఈ వనంలో మామిడి, ఎర్రచందనం, టేకు, రోజ్ ‌వుడ్, వెదురు, మహోగని లాంటి ఇతర చెట్లను పెంచబోతున్నారు.ఇంతకుముందు కూడా దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కోసం చాక్లెట్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా 600 కేజీలు గల సూపర్ స్టార్ రజనీకాంత్ చాక్లెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అభిమానులను ఆకట్టుకున్నారు ఆ బేకరి సంస్థ వారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎస్పీ బాలు చాక్లెట్ విగ్రహాన్ని ఒక లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube