పంది కడుపున మనిషి పుట్టాడంటూ వైరలవుతున్న వార్తలో నిజమెంత

పంది కడుపున మనిషి పుట్టాడు అంటూ ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఈ ఘటన తెలంగాణాలోనే జరిగిందంటూ వార్తలూ వచ్చాయి.

 A Baby Half Human And Half Pig Baby Is Born-TeluguStop.com

తెలంగాణంలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలోని విరారెడ్డిపల్లిలో చోటు చేసుకుందంటూ ప్రచారమూ జరిగింది.నిజానికి ఈ ఘటన కెన్యాలో చోటు చేసుకున్నట్లు తెలిస్తుంది.

అసలింతకీ ఏం జరిగింది.ఈ వార్తలో నిజమెంత మీరే చదవండి.

కెన్యాలోని మురంగాలో గల పందులశాలలో ఓ పందికి మనిషి రూపంలో ఉన్న పంది పిల్ల జన్మించినట్లు సమాచారం.అయితే, ఇది కూడా ఎంతవరకు వాస్తవం అనేది కూడా అనుమానమే.ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో అది బొమ్మలా కదులుతోంది.శుక్రవారం చంద్రగ్రహణం కావడంతో ఈ వింత చోటు చేసుకుందని, బ్రహ్మంగారు చెప్పిన మాట నిజమైందంటూ ఎవరికి తోచినట్లు వార్తను స్ప్రెడ్ చేస్తున్నారు.

సోషల్ మీడియలో ఒకసారి ఒకవార్త వైరలయిందంటే అందులో నిజనిజాలెంత అని ఎవరూ ఆలోచించరూ గుడ్డిగా నమ్మేస్తుంటారు.దాన్నే అదునుగా చేసుకుని ఆకతాయిలు ఇలాంటివాటిని క్రియేట్ చేసి అనవసర ప్రచారం కల్పిస్తుంటారు.

కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తని నమ్మేయకుండా నిజనిజాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించడం బెటర్.ఎందుకంటే గతేడాది గ్రహాంతరవాసులంటూ.

మనిషి రూపంలో ఉన్న అరుదైన చేప అంటూ రకరకాల వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.కాని వాటి వెనుక నిజాలు బయపడ్డాక అవునా అని ముక్కున వేలేసుకున్నారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube