వైరల్‌ : ముసలోడే కాని మహా ముదురు, 102 ఏళ్లకు రిటైర్మెంట్‌ తీసుకున్నాడు

ప్రస్తుతం ఉన్న జనరేషన్‌ వారు అయిదు పదుల వయసు వచ్చే వరకు బతుకుతారో లేదో అర్థం కాని పరిస్థితి.చేస్తున్న పని, తింటున్న ఆహారం, పీలుస్తున్న గాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా కలుషితం అవ్వడంతో పాటు ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో మనిషి సగటు ఆయుష్షు కేవలం 55 నుండి 65 సంవత్సరాలు మాత్రమే ఉంది అంటూ సర్వే చెబుతుంది.

 A American Government Survey Worker Retires At Age Of 102-TeluguStop.com

అప్పటి వరకు కూడా ఆరోగ్యంగా బతకడం అనేది చాలా గొప్ప విషయం అయ్యింది.అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా 102వ ఏట వరకు తన ఉద్యోగ విధులను నిర్వర్తించాడు.
మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు వయో పరిమితి ఉంటుంది.ఆరు పదుల వయసు రాగానే వారికి ఆరోగ్యం బాగానే ఉన్నా కూడా విధుల నుండి తొలగి పోవాల్సిందే.

కాని అమెరికాలో కొన్ని ఉద్యోగాల్లో అలా ఉండదు.వారు ఎంత కాలం ఓపికతో చేయాలనుకుంటే అప్పటి వరకు ఉద్యోగం చేయవచ్చు.

వారిని వద్దనేవారు ఉండరు.అలా ఇండియానా రాష్ట్రం క్లింటన్‌కు చెందిన బాంబ్‌ వోల్మర్‌ అనే వ్యక్తి మొదట ఆర్మీలో పని చేశాడు.

ఆర్మీలో ఉన్న సమయంలో రెండవ ప్రపంచ యుద్దంలో కూడా పాల్గొన్నాడు.ఆ సమయంలో ఆర్మీలో కీలక పాత్రను పోషించిన బాంబ్‌ ఆర్మీ నుండి తప్పుకుని సర్వేయర్‌ జాబ్‌లో జాయిన్‌ అయ్యాడు.

Telugu American Age, Bob, Projects-

60 ఏళ్లుగా సర్వేయర్‌గా బాంబ్‌ వోల్మర్‌ విధులు నిర్వహిస్తున్నారు.పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌ల నుండి చిన్న ప్రాజెక్ట్‌ల వరకు సంబంధించిన సర్వే వివరాలను సేకరించి డేటా నమోదు చేయడం ఈయన బాధ్యత.తన విధులను పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడంలో ఈయన ఎప్పటికప్పుడు ముందు ఉండేవాడు.తాజాగా ఈయన వయో భారంతో ఇక తప్పదనుకుని తాజాగా తన ఉద్యోగంకు రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు.
చివరగా మొన్న గురువారం ఒక సర్వేలో పాల్గొన్నాడు.అందుకు సంబంధించిన పత్రాలు అన్ని కూడా అధికారులకు అప్పగించి ఆ తర్వాత తన పదవికి గుడ్‌ బై చెప్పాడు.102 ఏళ్ల వయసు వరకు ఉద్యోగంలో కొనసాగిన ఆయన ఇంకా కూడా ఉద్యోగం చేయాలని ఉంది.కాని నాకు ఆరోగ్యం సహకరించడం లేదు అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube