లక్‌ అంటే ఇతడిదే : 25 వేలు పెట్టి వాచ్‌ కొంటే దాని విలువ రూ. 2.8 కోట్లకు చేరింది

మనం మామూలుగా ఏవైనా పాత సామాను లేదంటే వాడకుండా ఉన్న ఏదైనా వస్తువును అమ్మాలనుకుంటే దాన్ని కొన్న రేటులో సగానికి తక్కువకే అమ్మాల్సి వస్తుంది.ఉదాహరణకు 10 వేలు పెట్టి ఒక ఫోన్‌ కొనుగోలు చేస్తే దాన్ని నెల రోజుల్లో అమ్మినా కూడా అయిదు వేలకు కూడా కొనుగోలు చేసే వారు ఉండరు.

 A American Bought A Rolex Watch In 1974 Its Current Value In Crores-TeluguStop.com

వాహనాలు.ఇతరత్ర ఎలక్ట్రానిక్స్‌ ఇలా ఏదైనా కూడా సెకండ్‌ హ్యాండ్‌ అంటే చాలా చీప్‌ రేటుకు అమ్ముకోవాల్సి ఉంటుంది.

కాని వాటినే ఒక 40 లేదా 50 ఏళ్లు దాచి పెట్టుకోండి.అలా పెట్టుకుంటే అప్పుడు ఆ వస్తువు విలువ మీరు ఊహించనంత పెరిగే అవకాశం ఉంది.

అంటే అన్నీ అలా పెరుగుతాయో లేదో చెప్పలేం.కాని యూఎస్‌కు చెందిన ఒక వ్యక్తి 1974లో ఒక రోలెక్స్‌ వాచ్‌ను కొనుగోలు చేశాడు.

Telugu Americanrolex, Indian Currency, Rolex, Telugu Genearal, Telugu, Rolex Wat

  అప్పట్లో అతడున్న పరిస్థితుల్లో 10 శాతం డిస్కౌంట్‌ వస్తుందనే ఉద్దేశ్యంతో 346 డాలర్లకు అంటే ఇండియన్‌ కరెన్సీలో దాదాపుగా 25 వేల రూపాయలకు ఆ వాచ్‌ను కొనుగోలు చేశాడు.అంత ఖర్చు పెట్టి కొనుగోలు చేశాను అనే ఉద్దేశ్యంతో దాన్ని చాలా భద్రంగా దాచి పెట్టుకున్నాడు.కాల క్రమేనా ఆ వాచ్‌ అలాగే ఉంటూ వచ్చింది.ఒకటి రెండు సార్లు దాన్ని తీసి చూశాడు తప్ప పెట్టుకున్నది లేదు.ఆ వాచ్‌పై చిన్న గీత కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు.ఇప్పుడు ఆ వాచ్‌ అమెరికాలోని ప్రముఖ సంస్థ వేలంపాటలో కొనుగోలు చేసింది.

Telugu Americanrolex, Indian Currency, Rolex, Telugu Genearal, Telugu, Rolex Wat

  దాదాపుగా 45 ఏళ్ల క్రితం వాచ్‌ అయినందు వల్ల ఆ వాచ్‌ను ఏకంగా 4 లక్షల డాలర్లకు కొనుగోలు చేయడం జరిగింది.అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం 2.8 కోట్ల రూపాయలు.పాతిక వేలకు కొనుగోలు చేసిన వాచ్‌కు దాదాపుగా 2.8 కోట్ల రూపాయలు రావడంతో దాని యజమాని షాక్‌ అవుతున్నాడు.ఇలా అని తెలిస్తే అప్పట్లో రెండు మూడు కొనుగోలు చేసి పెట్టేవాడిని కదా అనుకుంటున్నాడట.

అతడు మాట్లాడుతూ నేను ఈ వాచ్‌ను అప్పట్లో నాకు అవసరం లేకున్నా కూడా 10 శాతం డిస్కౌంట్‌ ఉందనే కొనుగోలు చేశాను.అప్పటి స్లిప్‌ ఇంకా నా వద్ద ఉంది.

వాచ్‌ను జాగ్రత్తగా భద్రపరిచి ఉంచాను.ఆ సమయంలో నాకు ఇంతగా దీని విలువ పెరుగుతుందని తెలియదు.

కాని జాగ్రత్తగా దాచుకోవాలనే ఉద్దేశ్యంతో నేను దీనిని దాచాను.

Telugu Americanrolex, Indian Currency, Rolex, Telugu Genearal, Telugu, Rolex Wat

  ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు.ఇంకా కొన్నాళ్లు ఆగితే మూడు నాలుగు కోట్ల వరకు కూడా ఈ వాచ్‌ రేటు వెళ్లే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.ఆ వాచ్‌ రేటు పెరిగింది కదా అని మీరు వాచ్‌ కొనుగోలు చేసి దాచి పెట్టేందుకు ప్రయత్నించకండి.

ప్రస్తుతం ఉన్న వస్తువులను 100 ఏళ్లు అయినా కొనేందుకు ఎవరు ఆసక్తి చూపించరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube