తప్పిపోయిన కొడుకు కోసం 24 ఏళ్లు తిరిగిన తండ్రి.. చివరకు!

ప్రపంచంలో తల్లిదండ్రులు వెలకట్టలేని సంపదలని ఇప్పటికే చాలా మంది నిరూపించారు.సంతానం పుట్టిన దగ్గరి నుంచి తల్లి దండ్రులు చేసే త్యాగాలు చిరస్మరణీయంగా నిలుస్తాయి.

 A 24-year-old Father Turned Up For His Missing Son .. Finally, Missing . Son , 2-TeluguStop.com

తమ సంతానం బాగు కోసం ఎంత కష్టమైనా సరే తల్లిదండ్రులు రిస్క్​ చేస్తారు.ఇక పిల్లల్ని కోల్పోయి బాధపడే తల్లిదండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తరో మనం అనేక సినిమాల్లో చూశాం.

ఇలాగే చైనాకు చెందిన ఓ వ్యక్తి తన కన్న కొడుకు కోసం దాదాపు 24 సంవత్సరాల పాటు నిరీక్షించాడు.అసలు ఆ కథేంటో తెలుసుకుందామా.

చైనా దేశంలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్​ కు చెందిన గువో గ్యాంగ్‌టాంగ్‌ తన కొడుకు తప్పిపోవడంతో నరకయాతన పడ్డాడు.చివరికి 24 సంవత్సరాల తర్వాత తన కొడుకు ఆచూకీ తెలుకోగలిగాడు.

తన కొడుకును రెండు సంవత్సరాల చిరు ప్రాయంలోనే దుండగులు కిడ్నాప్​ చేశారు.ఎంత వెతికినా కూడా అతడి ఆచూకీ లభించలేదు.

సాధారణంగా ఇంటి బయట ఆడుకుంటుండగా ఆ బాలుడు కిడ్నాప్​ కు గురయ్యాడు.ఆయన తన కొడుకు జాడ కోసం 20 ప్రావిన్సులను కలియ తిరిగాడు.

దాదాపు ఐదు లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు.ఒక్కో సారి నిద్రించడానికి చోటు లేకపోవడంతో రోడ్లపై బ్రిడ్జిల కింద పడుకునేవాడు.

ఈ ప్రయాణంలో అతడికి చెందిన ఎన్నో ద్విచక్రవాహనాలు పాడయ్యాయి.ఎంతో మంది అనేక రకాలుగా తనను దోపిడీ చేశారు.

ఇలా గువో ఏడుగురు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు.

Telugu Yeras, China, Dna, Finally, Gang Tag, Hinan, Son-Latest News - Telugu

చివరికి గువో కుమారుడు హైనాన్‌లో నివసిస్తున్నట్లు తెలిసింది.దీంతో అతడికి డీఎన్​ఏ పరీక్ష చేయడం ద్వారా కన్​ ఫామ్ అయింది.ఇలా తప్పిపోయిన తన కొడుకు తిరిగొచ్చిన తర్వాత గువో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్​ మీడియాను షేక్​ చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube