అరుదైన ఘనత సాధించిన 13 ఏళ్ల కుర్రాడు.. అదేంటంటే?

తెలంగాణలో ఎంతో గొప్ప టాలెంట్ కలిగిన విద్యార్థులు ఉన్నారు.ఈ విషయం పలు సార్లు రుజువు కూడా అయింది.

 A 13-year-old Boy Who Has Achieved A Rare Feat .. Is That So?- Record ,hari Hara-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణలో ఓ విద్యార్థి నమోదు చేసిన ఘనత అందరినీ అబ్బురపరుస్తోంది.ఇంత గొప్ప రికార్డు సాధించడం ఎలా సాధ్యమైందని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇక అదేంటో తెలుసుకోవాలని మీరు ఆసక్తిగా ఉన్నారు కదా.ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి.

రాష్ట్రానికి చెందిన 13ఏళ్ల హరిహరణ్ నాయుడు అరుదైన ఘనత సాధించాడు.కళ్లకు గంతలు కట్టుకొని 29 నిమిషాల 19 సెకన్లలో 20 పాటలకు పియానో వాయించాడు.దీంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఆ కుర్రాడికి చోటు దక్కింది.మూడో తరగతి నుంచే సంగీతం నేర్చుకుంటున్న హరి.ప్రస్తుతం లండన్‌లోని ట్రినిటి సంగీత కళాశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.ఇవాళ వండర్ బుక్ అధికారులు మెడల్ అందించి మరిన్ని విజయాలు సాధించాలని కాంక్షించారు.

ఇప్పుడు ఈ కుర్రాడి ఘనత చాలా మంది విద్యార్థులను ఆకర్షించింది.ప్రతి ఒక్క విద్యార్థిని ఈ విధంగా ప్రోత్సహిస్తే ఎంతో మంది టాలెంట్ గల విద్యార్థులు నయా రికార్డులు సృష్టిస్తారని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube