12 ఏళ్లకే తండ్రి అయిన భారతీయ పిల్లాడు  

A 12 Year Old Indian Boy Becomes Father-

12 ఏళ్ల వయసులో మనమంతా ఎలా ఉండేవాళ్ళం ? బయట ఓ పదినిమిషాలు ఆట ఆడుకోవాలన్నా కష్టంగా ఉండేది .అట్లా పెరిగాం కదా మరి.స్కూలు తెలుసు అంటే, మళ్ళీ ఇల్లే తెలుసు..

A 12 Year Old Indian Boy Becomes Father---

ఇక అమ్మాయిలు అబ్బాయిలతో క్లోజ్ గా ఉండటం అన్నా, అమ్మాయిలతో అబ్బాయిలు క్లోజ్ గా ఉండటం అన్న అదో పెద్ద వింత.మరి ఇప్పుడో ? ఈ జనరేషన్ సంగతే వేరు.ఇంటర్నెట్ ఇంతలా అందుబాటులోకి వచ్చేసరికి వారికి తెలియని విషయం లేకుండాపోయింది.

కేవలం విదేశాల్లోనే పిల్లలు బాగా ఫాస్ట్ గా తయారవుతున్నారు అని అనుకుంటే అది మీ భ్రమే.మన ఇండియాలో కూడా చిచ్చరపిడుగులు ఉన్నారు.ఇప్పుడు కేరళకి చెందిన 12 ఏళ్ల తండ్రి ఓ పెద్ద సంచలనం.వినడానికి మీకు వింతగానే ఉంటుంది కాని ఇంకా టీనేజ్ లోకి అడుగు కూడా పెట్టకముందే ఓ అమ్మాయిని గర్భవతి చేసేసాడు ఈ పిల్లాడు.

వీడే బుడ్డోడు అంటే, వీడికో బుడ్డోడు పుట్టాడు.ఇంతకీ తల్లి వయసు ఎంత అనుకుంటున్నారు .తను కనీసం టీనేజ్ దాకా అయినా వచ్చింది .తన వయసు 16.ఈ ఇద్దరికీ ఇలాంటి దోస్తీ ఎందుకు అయ్యిందో, ఇద్దరు కలిసి అలాంటి పని చేయాలని ఎందుకు అనుకున్నారో కాని, అమ్మాయి గర్భం దాల్చేసింది.

గత ఏడాది నవంబర్ లోనే బిడ్డకి జన్మనిచ్చింది.అయితే డాక్టర్స్ కి ఓ అనుమానం పట్టుకుంది .అమ్మాయి చెబుతున్నట్టుగా నిజంగా ఈ బిడ్డకి తండ్రి ఆ 12 ఏళ్ల బుడ్డోడేనా కాదా అని.ఎందుకంటే 12 ఏళ్ళకి తండ్రి అవడం వారు ఎప్పుడు కనలేదు, వినలేదు.దాంతో కొంతకాలం ఓపిక పట్టి DNA టెస్ట్ చేసారు.ఇన్నాళ్ళ టెస్టులు చేసి చేసి, చివరికి ఏం నిరూపించారు అంటే, ఆ అమ్మాయి చెప్పిందే నిజం.ఆమె బిడ్డకి తండ్రి ఆ 12 ఏళ్ల బాలుడే.ఏం చేయాలో అర్థం కాక POSCO act కింద ఇద్దర్ని బుక్ చేసి వదిలేసారు పోలీసులు.

ఇక తల్లిదండ్రులకైతే ఏమి అర్థం కావడం లేదు .ఈ ఇద్దరు పిల్లల్ని, వాళ్లకి పుట్టిన పిల్లాడిని చూసుకుంటూ నోళ్ళు వెల్లబెడుతున్నారు.