మహేష్ బాబు ఫ్యాన్స్ .. మీకు పండగే పండగ

సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకి ఉగాది పండగపూట మంచి బహుమతులు ఇవ్వనున్నాడు.మామూలుగా అయితే సినిమా విడుదలకి మరో మూడునాలుగు నెలలు ఉన్నాయి అనే సమయంలో మహేష్ బాబు చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చేవి.

 Brahmotsavam 1st Look Poster On Ugadi-TeluguStop.com

కాని బ్రహ్మోత్సవం విషయంలో అలా జరగలేదు.సినిమా మొదలయ్యి పది నెలలు దాటినా, టైటిల్ లోగో వదిలారే తప్ప .ఒక్క పోస్టర్ కూడా వదల్లేదు.ఆ మధ్య వచ్చిన టీజర్ కూడా సాంగ్ టీజర్.

దీంతో మహేష్ అభిమానులు ఆకలితో అలమటించిపోతున్నారు.

వారి నిరీక్షణకు తెరదించబోతోంది బ్రహ్మోత్సవం యూనిట్.

ఈ చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ ఉగాది కానుకగా రాబోతోంది.పోస్టర్ తో పాటు ఒక టీజర్ కుడా వదలే అవకాశాలు ఉన్నాయి.

మొదట ఉగాదికి బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్ అన్నారు.ఎందుకో కుదర్లేదు.

ఏదేమైతేనేం .పండగపూట అభిమానులు నిరాశపడకుండా చూసుకున్నాడు సూపర్ స్టార్.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవిపి సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీత దర్శకుడు.రాత్నవేలు ఛాయగ్రహణం అందిస్తున్నాడు.సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు.వచ్చే నెల బ్రహ్మోత్సవం ప్రేక్షకుల ముందుకి రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube