బాలకృష్ణగారు ... జాగ్రత్త!

ముఖం మీదే సూటిగా మాట్లాడటం నందమూరి బాలకృష్ణకు అలవాటు.మనసులో ఒకటి పెట్టుకోని, బయటకి ఒకటి మాట్లాడటం అంటే ఎంటో అసలు తెలియనివాడు మన బాలయ్యబాబు.

 Balakrishna Slipping Tongue … Fans Bearing The Heat-TeluguStop.com

ఇది కొందరికి నచ్చే గుణమైతే, కొందరికి నచ్చని గుణం.

గత పదిరోజుల్లో రెండుసార్లు సంచలన వాఖ్యలు చేసారు బాలకృష్ణ.

లేపాక్షి ఉత్సవాలప్పుడు మెగాస్టార్ చిరంజీవి మీద నోరుపారేసుకున్న బాలయ్య, మెగా ఫ్యాన్స్ తోపాటు , సగటు సిని అభిమానులందరి దృష్టిలో విలన్ గా మారారు.

ఇక తాజాగా సావిత్రి ఆడియో ఫంక్షన్ లో అమ్మాయిలని ముద్దు పెట్టుకోవడం, కడుపు చేయడం వంటి అనుచిత వాఖ్యలు చేసి తన విమర్శకులకి మళ్ళీ అవకాశమిచ్చారు బాలకృష్ణ.

ఈ సంఘటనలని ఇటు సమర్థించలేక, అటు బాలయ్యను ఏమి అనలేక ఇబ్బంది పడుతున్నారు బాలయ్య అభిమానులు.ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఈ వాఖ్యలను పట్టుకోని యాంటి ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూసి తల ఎత్తుకోలేకపోతున్నారు బాలకృష్ణ అభిమానులు.

ఇకనైనా బాలకృష్ణ ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది.ఎందుకంటే ఆయన ఇప్పుడు కేవలం ఒక సినిమా హీరో కాదు కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube