కెసిఆర్ ని కాపీ కొట్టేసిన చంద్రబాబు

గ్రేటర్ హైదరాబాద్ కి ఎన్నికలు జరగాల్సిన సమయం ఒచ్చినప్పుడే కెసిఆర్ సరిగ్గా ఆ ఒప్పందాలు అన్నీ హైదరాబాద్ ని అభివృద్ధి కేంద్రంగా నిర్ణయాలు తీసుకున్నారు, ముఖ్యమంత్రి హోదా లు ఉండడం తో తేలికగా హైదారాబాద్ అభివృద్ధి కోసం పలు ఆసక్తికర ప్రణాళికలు రాసారు ఆయన.దాంతో గ్రేటర్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ వారి సొంతం అయ్యింది.

 Chandrababu Copies Kcr-TeluguStop.com

ఇప్పుడు అదే ఫార్ములా ని ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫాలో అవ్వడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది.గ్రేటర్ విశాక కార్పరేషన్ విషయం లో వైఖరి ఆ రకంగానే ఉంది.

విశాఖ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో జరిగిన ఫ్లీట్ రివ్యూ మైలేజ్ పొందిన బాబు ఇప్పుడు సొంతగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గట్టి నిర్ణయం తీసుకున్నారు.

విశాఖ స్మార్ట్ సిటీకి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… అమెరికా టెక్నాలజీకి పెట్టింది పేరని వారు తమ పరిజ్ఞానాన్ని అందిస్తే తమ యంత్రాంగంతో విశాఖను అభివృద్ధిని పథంలో నడిపిస్తామన్నారు.దేశంలో తొలి విడతగా ఎంపిక చేసిన 20 నగరాల్లోనూ విశాఖ తొలిస్థానంలో నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు.

ఏపీలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలు ఉన్నాయని త్వరలోనే రెండు పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తామన్నారు.విశాఖ -చెన్నై పారిశ్రామిక కారిడార్తో పాటు బెంగుళూరు-చెన్నై కారిడార్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

ఇందుకోసం జపాన్ – ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) సహకారం అందించనున్నట్లు బాబు వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube