అయ్యో.. ఎన్టీఆర్‌ జస్ట్‌ మిస్‌

ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం తాజాగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.సంక్రాంతికి పలు సినిమాలు బరిలో ఉన్నా కూడా వాటన్నింటిలో కూడా ఈ చిత్రం టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.

 Nannaku Prematho Movie Stands In Third Place-TeluguStop.com

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా దుమ్ము రేపే కలెక్షన్స్‌తో అదరగొడుతోంది.ఇక ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ ఎన్నో రోజుల కల నెరవేరింది.

ఓవర్సీస్‌లో టాప్‌ 3లో ఎన్టీఆర్‌ ఈ చిత్రంతో నిలిచాడు.మొదటి స్థానంలో ఏ ఒక్కరికి అందని అంత ఎత్తులో ‘బాహుబలి’ నిల్వగా, రెండవ స్థానంలో మహేష్‌బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం ఉంది.

ఇక మూడవ స్థానంలో ఇప్పటి వరకు ఉన్న ‘అత్తారింటికి దారేది’ని ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో క్రాస్‌ చేసి మూడవ స్థానంలో సెటిల్‌ అయ్యాడు.

‘నాన్నకు ప్రేమతో’ కలెక్షన్స్‌ జోరు చూసి ఖచ్చితంగా ఓవర్సీస్‌లో రెండవ స్థానంలో నిల్వడం ఖాయం అని అంతా అనుకున్నారు.

అయితే అమెరికాలో భారీగా కురుస్తున్న మంచు కారణంగా ఇంట్లోంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు.దాంతో థియేటర్లు దాదాపుగా అన్ని కూడా మూత పడ్డాయి.అక్కడ పరిస్థితి నిలకడగా ఉండి ఉంటే ఖచ్చితంగా ‘శ్రీమంతుడు’ సాధించిన 2.25 మిలియన్‌ డాలర్లను ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం సాధించేది అని ట్రేడ్‌ విశ్లేషకులు సైతం అంటున్నారు.ఇప్పటి వరకు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం 2 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయగలిగింది.ఇంకా వసూళ్లు వస్తాయనే నమ్మకం లేదు.దాంతో ఈసారికి మూడవ స్థానంతో ఎన్టీఆర్‌ సరిపెట్టుకోవాల్సి వస్తుంది.కాస్తలో మంచి రికార్డును ఎన్టీఆర్‌ మిస్‌ చేసుకోవడంతో నందమూరి ఫ్యాన్స్‌ నిరుత్సాహానికి లోనవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube