తప్పు జరిగిందా? తప్పు చేశాడా?

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి పౌరసత్వంపై బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిగ్గా మారింది.రాహుల్ తప్పు చేశాడా? ఆయనకు తెలియకుండా తప్పు జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.రాబోయే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై దుమారం రేగే పరిస్థితి కనబడుతోంది.సోనియా గాంధి కుమారుడు రాహుల్ ఆరోపణలు కాబట్టి ఆ పార్టీ నాయకులు ఊరుకోరు.

 Rahul Declared He Is British-TeluguStop.com

బీహార్ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయి ఉన్న కాషాయ పార్టీకి కాంగ్రెస్ మీద దాడి చేయడానికి ఆయుధం దొరికింది.రాహుల్ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలనుకుంటున్న సమయంలో ఇంత తీవ్ర ఆరోపణలు వస్తే కాంగ్రెస్ ఊరుకోదు కదా.కాబట్టి అది బీజేపీ మీద గట్టిగా ఎదురు దాడి చేయడం ఖాయం.బ్రిటన్లో 2003లో ప్రారంభమైన బాకప్స్ అనే కంపెనీ 2009లో మూత పడింది.

దాంట్లో రాహుల్ గాంధీకి 83 శాతం షేర్లు ఉన్నాయని సమాచారం.ఆ కంపెనీ తన వార్షిక నివేదికలో రాహుల్ గాంధీని బ్రిటిష్ సిటిజన్ అని పేర్కొంది.

ఇది ఎలా కరిగిందో తేలాలి.ఇది తేల్చడం మోడీ ప్రభుత్వానికి కష్టం కాదు.

బాకప్స్ కంపెనీలో రాహుల్కు పెద్ద ఎత్తున వాటాలు ఉన్నప్పుడు అతను కంపెనీ యజమాని కిందే లెక్క.అలాంటప్పుడు కంపెనీ పత్రాలన్నీ ఆయన చేతికి అందుతాయి.మరి తనను బ్రిటిష్ సిటిజన్ అని రాసిన విషయం ఆయన దృష్టికి రాలేదా? బాకప్స్ కంపెనీ గురించి రాహుల్ ఏమీ దాచలేదు.2004 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల కమీషనుకు సమర్పించిన అఫిడవిట్లో బ్రిటన్ కంపెనీలో తన షేర్ల విషయం తెలియచేశారు.రాహుల్ బ్రిటిష్ పౌరసత్వమ్ తీసుకున్నాడు కాబట్టి ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని, పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని స్వామి డిమాండ్ చేశారు.స్పీకరుకు, ప్రధానికి లేఖలు రాశారు.

వారు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube