పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ మరోసారి ఆంధ్రా రాజధాని అమరావతి తెర మీదికి రాబోతున్నారు.కారణం స్వచ్చందంగా భూములు ఇవ్వని రైతుల భూములు సేకరించడానికి బలవంతంగా సేకరిస్తామని చెప్పడమే.
భూములు ఇవ్వని వారి భూములు సేకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం కొంత కాలం కిందట ప్రకటించింది.రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 33000 ఎకరాల భూములు సేకరించిన ప్రభుత్వం అదే ప్రాంతంలో మరో 300 ఎకరాలు కావాలని అంటోంది.
అయితే తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని కొన్ని గ్రామాల్లో రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.కొందరు కోర్టుకు కూడా వెళ్ళారు.
భూములు ఇవ్వకపోతే నచ్చచెప్పాలని, అప్పటికీ ఇవ్వకపోతే బలవంతంగా తీసుకోవాలని సర్కారు భావిస్తోంది.బలవంతంగా భూములు తీసుకోవద్దని పవన్ కళ్యాన్ గతంలో ప్రభుత్వానికి చెప్పారు.
అలా చేస్తే తాను ఆందోళన చేస్తానని హెచ్చరించారు.భూములు ఇవ్వని రైతుల గ్రామాల్లో ఆయన పర్యటించారు.
అయితే ఈ లోగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో బిజీగా ఉన్న ప్రభుత్వం ఈ విషయం పక్కన పెట్టింది.కానీ మళ్ళీ ఈ విషయం తెర మీదికి రావడంతో పవన్ కళ్యాన్ సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని అనుకుంటున్నారు.
ఆయన అపాయింట్మెంట్ అడిగారని సమాచారం.ఒకవేళ అపాయింట్మెంటు ఇస్తే ఏం మాట్లాడుతారో చూడాలి