అభిమానుల్ని ఫేస్ చేయలేకపోయిన మహేష్

దూకుడు,బిజినెస్మెన్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు … ఇలా వరస విజయాలతో అభిమానుల్ని అలరించాడు మహేష్.ఓవైపు దూకుడు 100 రోజుల సంబరాల్లో ఉండగా, వెంటనే బిజినెస్మెన్ తో హిట్ కొట్టి అబ్బురపరిచాడు సూపర్ స్టార్.

 Mahesh Couldn’t Face His Fans-TeluguStop.com

మళ్ళి సంవత్సరానికి వచ్చిన 1-నేనొక్కడినే తీవ్రంగా నిరశాపరించింది, ఇక దాని తర్వాత వచ్చిన ఆగడు ని తిట్టుకొని అభిమాని లేడు.అభిమానులు సంతోషానికి దూరం అయిపోయారు.

దాంతో మహేష్ ముఖం చూపించలేక బయటకి రావడం మానేసాడు.

మధ్యలో తన సొంత ఫ్యామిలి హీరో అయిన సుధీర్ బాబు రెండు సినిమాలు విడుదల అయినా వాటికి సంబంధించిన ఏ ఫంక్షన్ కి కుడా రాలేదు మహేష్.

కారణాలు బయటకి చెప్పకపోయినా.మొత్తానికి నిన్న మనసు విప్పేసాడు మహేష్.

నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో అభిమానుల్ని ఉద్ద్యేషిస్తూ మహేష్ మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో తెలియలేదు, అందుకే కనిపించలేదు అని చెప్పేసాడు.శ్రీమంతుడు లాంటి బ్లాక్బస్టర్ తో అభిమానులకి తిరిగి మంచి రోజులు తీసుకొచ్చాడు మహేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube