ప్రజా 'రాష్ర్టపతి' ఇక లేరు

‘మిస్సైల్‌ మేన్’గా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శాస్ర్తవేత్త, భారత మాజీ రాష్ర్టపతి అబ్దుల్‌ కలాం ఇకలేరు.ప్రజా ‘రాష్ర్టపతి’గా పేరు పొందిన సున్నిత మనస్కుడు, ఉన్నత సంస్కారం గల నాయకుడు సోమవారం సాయంత్రం మేఘాలయాలో కన్నుమూశారు.

 Former President Apj Abdul Kalam Dies-TeluguStop.com

షిల్లాంగ్‌ ఐఐటీలో సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ప్రసంగిస్తుండగానే కలాం కుప్పకూలిపోయారు.తీవ్రమైన గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు చెప్పారు.

ఎనభై మూడు సంవత్సరాల కలాం దేశానికి పదకొండో రాష్ర్టపతిగా సేవలందించారు, ఈ వార్త తెలియగానే దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.ప్రధానంగా యువతకు అబ్దుల్‌ కలాం గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలిచారు.కలాం మాదిరిగా యువతను ఉత్తేజపరిచిన మరో నాయకుడు కనబడరు.‘కలలు కనండి…వాటిని సాకారం చేసుకోండి’ అనేది ఆయన గొప్ప కొటేషన్‌.కలాం గౌరవార్ధం ప్రభుత్వం ఏడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube