ఇద్దరి మధ్య విభేదాలా?

‘హార్ట్‌ఎటాక్‌’ సినిమా కోసం యువ హీరో నితిన్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌లు కలిసి వర్క్‌ చేశారు.ఆ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది.

 Why Puri Replaced Varun With Nithin ?-TeluguStop.com

ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశాలున్నాయని అప్పుడే ప్రచారం జరిగింది.అయితే వీరిద్దరి కాంబోలో రెండవ సినిమాకు ఇటీవలే ఓకే అయ్యింది.

నితిన్‌ స్వయంగా ట్విట్టర్‌లో తాను పూరి దర్శకత్వంలో రెండవసారి నటించబోతున్నాను అంటూ ప్రకటించాడు.అయితే తాజాగా ఆ ప్రాజెక్ట్‌ నుండి నితిన్‌ను తప్పించి వరుణ్‌ తేజ్‌తో పూరి సినిమా చేస్తున్నాడు.

ఉన్నట్లుండి పూరి ఎందుకు నితిన్‌ను తొలగించాడు అనేది ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా చర్చ సాగుతోంది.పూరికి నితిన్‌కు మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా, అందుకే నితిన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాడా, లేక ఈ స్క్రిప్ట్‌ నితిన్‌ కంటే కూడా వరుణ్‌కు బాగా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో పూరి హీరోను మార్చాడా అనేది చర్చనీయాంశంగా మారింది.

వరుణ్‌, పూరిల కాంబోలో మూవీని సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు.మరో వైపు నితిన్‌ కొత్త సినిమాను త్వరలో ఆరంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube