‘బాహుబలి’ కోసం నాని

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’.ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

 Hero Nani To Host Bahubali Audio Event-TeluguStop.com

తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల ఏర్పాట్లలో జక్కన్న యమ బిజీగా ఉన్నాడు.మే 31న అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమా ఆడియోను విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా యువ హీరో నానిని సంప్రదించడం జరిగింది.అందుకు నాని వెంటనే ఓకే చెప్పాడు.

రాజమౌళి గత చిత్రం ‘ఈగ’ సినిమాలో హీరోగా నటించిన నానికి ఈ అవకాశం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.అడిగిన వెంటనే యాంకరింగ్‌ చేసేందుకు ఒప్పుకున్న ‘ఈగ’కు కృతజ్ఞతలు అంటూ జక్కన్న ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

ఇప్పటి నుండే నాని ఆడియో కార్యక్రమంకు యాంకరింగ్‌ చేసేందుకు సన్నద్దం అవుతున్నాడు.తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలతో పాటు తమిళ మరియు హిందీ పరిశ్రమల నుండి కూడా ప్రముఖులు ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో సందడి చేయనున్నాడు.

ఈ వేదికపై తెలుగుతో పాటు తమిళ మరియు హిందీ ఆడియోలను కూడా విడుదల చేయనున్నారు.ఈ సినిమాను జులై 10న విడుదల చేయనున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube