పవన్‌ కళ్యాణ్‌ షాకింగ్‌ లుక్‌

ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీజ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు సమయంలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఆ అమ్మాయిని పరామర్శించిన విషయం తెల్సిందే.హాస్పిటల్‌లో శ్రీజను పరామర్శించడంతో పాటు వారికి ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది.

 Pawan Kalyan New Look With Long And Thick Bread-TeluguStop.com

శ్రీజను చూసిన సమయంలో పవన్‌ కళ్యాణ్‌ కన్నీటి పర్యంతం అయ్యాడు.చర్చనీయాంశం అయిన శ్రీజ మరోసారి వార్తల్లోకి వచ్చింది.

పూర్తి ఆరోగ్యంతో శ్రీజ ఇప్పుడు మారింది.

దాంతో తనకు సాయం చేసిన పవన్‌ కళ్యాణ్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్‌కు తరలి వచ్చింది.

ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ మీడియా వారు పవన్‌ను కలిశారు.శ్రీజతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ఆ ఫొటోల్లో పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ ఆశ్చర్యకరంగా ఉంది.గడ్డం బాగా పెంచేసిన పవన్‌ కళ్యాణ్‌ ఒక యోగిగా కనిపిస్తున్నాడని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తోంది.

త్వరలో నటించబోతున్న ‘గబ్బర్‌సింగ్‌`2’ కోసం ఇలా గడ్డం పెంచాడా లేక మామూలుగానే పవన్‌ కళ్యాణ్‌ గడ్డం పెంచాడా అనేది చర్చనీయాంశంగా మారింది.పవన్‌ కళ్యాణ్‌ను అభిమానులు సైతం ఈ లుక్‌లో చూడలేక పోతున్నట్లుగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube