చరణ్‌ అధికారిక ప్రకటన

పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో రామ్‌ చరణ్‌ నటించనున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.ఈ వార్తలను మెగా ఫ్యాన్స్‌ నమ్మలేకుండా ఉన్నారు.

 Ram Charan Officially Confirmed Movie With Pawan Kalyan-TeluguStop.com

ఇది నిజమా లేక పుకారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ తాజాగా తాను బాబాయి నిర్మాణంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా ప్రకటించాడు.

బాబాయితో సినిమా చేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ ఫేస్‌బుక్‌ ద్వారా పేర్కొన్నాడు.చరణ్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌ సంతోషంలో మునిగి తేలుతున్నారు.

ప్రస్తుతం ‘నా పేరే రాజు’ సినిమాలో నటించేందుకు సిద్దం అవుతున్న చరణ్‌ ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో నటించనున్నాడు.ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ టీం చరణ్‌ కోసం ఒక మంచి కథను సిద్దం చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.ఇక ఈ సినిమా తర్వాత పవన్‌ తన నిర్మాణ సంస్థలో వరుసగా చిన్న హీరోల మరియు దర్శకులతో సినిమాలు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక పవన్‌ కళ్యాణ్‌ హీరోగా త్వరలో ‘గబ్బర్‌సింగ్‌`2’ ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube