చిరు సినిమాపై స్పందించిన పూరి

చిరంజీవి 150వ సినిమా గురించి మళ్లీ చర్చ మొదలైంది.ఇటీవల ‘టెంపర్‌’ మూవీ చూసిన తర్వాత వివాదల వర్మ ఆసక్తికర కామెంట్స్‌ చేయడం జరిగింది.

 Puri Jagannath Comments On Chiru’s 150th Film-TeluguStop.com

‘టెంపర్‌’ సినిమాలో టేకింగ్‌ మరియు స్క్రీన్‌ప్లే సూపర్‌ అని, ఇంత మంచి దర్శకుడిని పక్కన పెట్టి మరెవ్వరో దర్శకుడి కోసం చిరంజీవి ఎదురు చూడాల్సిన అవసరం లేదంటూ ట్వీట్‌ చేశాడు.వెంటనే అన్వేషణ మాని చిరంజీవి తన 150వ సినిమాను పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో చేసి, సక్సెస్‌ కొట్టాలని కూడా వర్మ అన్నాడు.

తన గురువు అయిన వర్మ ట్వీట్‌పై పూరి స్పందన ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

వర్మ సలహా మేరకు చిరంజీవి గారు తనతో సినిమా చేసేందుకు ముందుకు వస్తే తాను ఆ చాలెంజ్‌ను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు.

చిరంజీవి గారి ప్రతిష్టాత్మక 150వ సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం వస్తే నా సత్తా చూపిస్తా అంటూ పూరి పేర్కొన్నాడు.ఇటీవలే మచ్చ రవి ఒక కథను తయారు చేశాడని ప్రచారం జరుగుతోంది.

ఆ కథను పూరి జగన్నాధ్‌కు అప్పగించి చిరు సినిమా చేయాలని కొందరు కోరుకుంటున్నారు.మరి అందరు భావించి, కోరుకునేలా చిరు నిర్ణయం తీసుకుంటాడా లేక మరే కొత్త నిర్ణయం అయినా తీసుకుంటాడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube