సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

గత కొన్ని రోజులుగా బీహార్‌ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంరీa జాతీయ మీడియాలో ప్రముఖంగా ఉంటూ వస్తున్నాడు.అధికార మార్పిడికి ఎమ్మెల్యేలు ఎంతగా ప్రయత్నించినా కూడా తాను పట్టు వదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్న ఈ ముఖ్యమంత్రి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియా ముందుకు వచ్చాడు.

 Bihar Cm Manjhi Controversy Comments-TeluguStop.com

పెళ్లి తర్వాత భార్య భర్తలు గడుపుతున్న సంసార జీవితం గురించి, భర్తలు చేస్తున్న డేటింగ్‌ల గురించి మాంరీa విభిన్న రీతిలో స్పందించాడు.

పెళ్లి చేసుకున్న వారిలో కేవలం అయిదు శాతం మంది మాత్రమే తమ భార్యలను తమతో పాటు బయటకు తీసుకు వెళ్తున్నారని, మిగిలిన వారు అంతా కూడా ఇతరుల భార్యలతో డేటింగ్‌లో ఉన్నారని అన్నాడు.

అయితే ఇద్దరి సమ్మతితో అలా చేయడం తప్పుకాదని కూడా ఈ సీఎం చెప్పుకొచ్చాడు.భార్య, భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటున్న సమయం చాలా తక్కువ అని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి ఇతరుల భార్యలతో మాత్రం భర్తలు చాలా ప్రేమగా వ్యవహరిస్తారు అని అన్నాడు.

ఈయన వ్యాఖ్యలను కొందరు అర్థం పర్థం లేని వ్యాఖ్యలుగా కొట్టి పారేస్తుంటే మరి కొందరు మాత్రం సమర్థిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube