పవన్‌, నేను మంచి తల్లిదండ్రులం

పవన్‌ కళ్యాణ్‌, రేణుదేశాయ్‌ చాలా కాలం క్రితమే భార్యభర్తలుగా విడిపోయిన విషయం తెల్సిందే.వీరిద్దరికి అప్పుడే కోర్టు విడాకులు మంజూరు చేసింది.

 Renu Desai About Her Children Caring-TeluguStop.com

వీరిద్దరు విడిపోయినా కూడా పిల్లలకు తల్లిదండ్రుల లోటు లేకుండా పెంచుతున్నారు.పిల్లల కోసం ప్రతీ రోజు మాట్లాడుకుంటూ, వారికి కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ వారిని మంచి మార్గంలో పెంచుతున్నారు.

ఇదే విషయం తాజాగా రేణు దేశాయ్‌ ప్రకటించింది.

తాను, పవన్‌ విడిపోయినా కూడా అది పిల్లల భవితవ్యంపై పడకూడదనే ఉద్దేశ్యంతో తామిద్దరం మంచి స్నేహితుల్లా ఉంటున్నామని, ఇద్దరం కలిసి లేకున్నా కూడా ప్రతీ రోజు ఫోన్‌లో మాట్లాడుతూ పిల్లల గురించి చర్చించుకుంటామని రేణు చెప్పుకొచ్చింది.

తాజాగా ట్విట్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఒక మంచి తండ్రి కాదు అన్న కామెంట్‌కు సమాధానంగా రేణు దేశాయ్‌ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.పిల్లల కోసం విడిపోయిన భార్యభర్తలు స్నేహితుల్లా కలిసి ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.

అది పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌లకు చెందింది అంటున్నారు పవనిజం నమ్మేవారు.అన్నింట పవన్‌ బెస్ట్‌ అంటూ ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube