ఏకగ్రీవమా...లేక అనివార్యమా!!!

తిరుపతి ఎం.ఎల్.

 Late Mla’s Wife In Tirupati By-election-TeluguStop.com

ఏ వెంకటరమణ గుండె పోటుతో హతాన్మరణం చెందిన విషయం అందరికి విదితమే.అయితే ఆ స్థానం ఖాళీ కావడం.

మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి అని ఎలెక్షన్ కమీషన్ నిర్ణయించింది.ఇక అందులో భాగంగా తిరుపతి శాసన సభ నియోజకవర్గానికి ఫిబ్రవరి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత వెంకటరమణ భార్య సుగుణమ్మ పోటీ చేస్తారని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు కుటుంబ సమేతంగా వచ్చిన చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం స్థానిక టిటిడి కల్యాణ మండపంలో తిరుపతి నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరమణ మరణం పార్టీకి తీరని లోటన్నారు.ఆయన పేదల సంక్షేమం కోసం ఇతోధికంగా కృషి చేశారన్నారు.

అందుకే ఆయన స్థానాన్ని ఆయన సతీమణి సుగుణమ్మకు ఇవ్వాలని నిర్ణయించానన్నారు.సుగుణమ్మ విద్యావంతురాలని , బాగా పనిచేయగల సమర్ధత ఉందని తాను బలంగా విశ్వసిస్తున్నానన్నారు.

సుగుణమ్మ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీల నాయకులను కోరతానని, ఎందుకంటే ఇలాంటి సాంప్రదాయం ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతోందని బాబు అన్నట్టు సమాచారం.సుగుణమ్మ విలేఖరులతో మాట్లాడుతూ తన భర్త వెంకటరమణ ఆశయాలను నెరవేర్చి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తానని ఉద్వేగంగా అన్నారు.

తన ఏకగ్రీవ ఎన్నికకు ఇతర పార్టీల నాయకులు కూడా సహకరిస్తారన్న విశ్వాసం ఉందన్నారు.పోటీ అనివార్యం అయితే 70 వేల మెజార్టీతో గెలుపొందుతానన్నారు.

మరి దీనిపై వైకాపా, కొంగ్రెస్ లు మెత్త పడతాయో, లేక పట్టుబట్టి ఎన్నికల బరిలో దిగుతాయో చూడాలి,

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube