"బ్యాడ్ న్యూ ఇయర్" ట్వీట్ తో షాక్ ఇచ్చిన వర్మ

సంచలనాల వర్మ మరో సంచలన వార్తకు శ్రీ కారం చుట్టాడు.ఎప్పుడూ తన ట్వీట్స్ తో అందరినీ విమర్శిస్తూ వార్తల్లో ఉండే వర్మ ఇప్పటి వరకు దేవుళ్ళను, సినీ హీరోలను టార్గెట్ చేస్తూ టైమ్ పాస్ చేస్తూ వస్తున్నాడు.

 Varma Shocking Comments On New Year-TeluguStop.com

అయితే ఇప్పుడు ఏకంగా యావత్ ప్రపంచం ఆశగా ఎదురు చూస్తున్న 2015 న్యూ ఇయర్ పైనే వర్మ సంచలన కామెంట్స్ చేశాడు.ఆయన తన ట్విట్టర్ లో అందరికి ట్వీట్ చేస్తూ అందరికి ‘విష్ యు ఎ సాడ్ ఇయర్’ అంటూ ఒక వెరైటీ ట్విట్ పెట్టి అందరి మైండ్స్ బ్లాంక్ చేసాడు.

అంతేకాకుండా దానికి ఆయన ఇచ్చిన వెరైటీ సమాధానం కూడా అందరినీ ఆశ్చర్య పరిచింది.ఎందుకిలా చేశాడా అని తలలు బాదుకుంటున్న వారికి వర్మ చెప్పిన మాటలు మరింత విసుగు తెప్పించాయి.

వర్మ దీనిపై మాట్లాడుతూ మనం ఎప్పుడూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు పాత సంవత్సరానికి మన బాధనలను కూడా తీసుకు వెళతాము కాబట్టి మనందరికీ రాబోతున్న సంవత్సరం సాడ్ ఇయర్ అంటూ ఆయన వెరైటీగా తెలిపాడు.మరి విజయాలు లేక వర్మ అలా మాట్లాడుతున్నాడో, లేక మరేమైనా కారణాల దృష్ట్యా ఆలా అంటున్నాడో తెలీదు కానీ మొత్తానికైతే ట్వీట్ తో మరో సారి వార్తాల్లోకి ఎక్కేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube