ఏపీ ప్రజలు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు రిలీజ్ చేస్తున్న ప్రతి సర్వేను పరిశీలిస్తున్నారు.సర్వేల లెక్కలు నిజమవుతాయో లేదో చెప్పలేం కానీ మెజారిటీ సర్వేల ఫలితాలు ఒరిజినల్ ఫలితాలకు దగ్గరగానే ఉంటాయి.అయితే రేస్ సర్వే ఫలితాలు( RACE Survey Results ) మాత్రం ఒకింత షాకిచ్చేలా ఉన్నాయి.2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్( Pawan Kalyan ) కు, నగరి నుంచి పోటీ చేస్తున్న రోజా( Roja )కు భారీ షాక్ తప్పదని రేస్ సర్వే చెబుతోంది.మరోవైపు టీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో బాలయ్యకు షాక్ తప్పదని దీపిక బాలయ్యకు గట్టి పోటీ ఇవ్వనుందని ఈ సర్వేలో వెల్లడైంది.2014, 2019 ఎన్నికల్లో విజయం కోసం బాలయ్య మరీ కష్టపడలేదు.
అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం టీడీపీ( TDP )కి అనుకూలంగా వచ్చాయి.2024 ఎన్నికల్లో గెలుపు కోసం బాలయ్య మరింత కష్టపడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.హిందూపురం కోసం బాలయ్య ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.అయితే ప్రజలకు బాలయ్య( Balakrishna ) పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండరని విమర్శలు ఉన్నాయి.ఈ విమర్శలే బాలయ్యకు పోటీ సులువు కాని పరిస్థితులను తెచ్చాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే బాలయ్య మాత్రం సునాయాసంగా గెలుపు సొంతమయ్యే ఛాన్స్ అయితే ఉందని నమ్మకంతో ఉన్నారు.
ఏపీలో 109 స్థానాలలో వైసీపీ( YCP ) విజయం సాధిస్తుందని రేస్ సర్వే చెబుతోంది.టీడీపీ జనసేన బీజేపీ కూటమి( TDP Janasena BJP ) కేవలం 32 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది.మిగతా స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉండనుందని తెలుస్తోంది.ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి టీడీపీకి ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.రేస్ సర్వే ఫలితాలు ఒకింత షాకిచ్చేలా ఉన్నాయి.ఈ సర్వే ఫలితాలు వైసీపీలో జోష్ నింపుతుండగా టీడీపీకి మాత్రం నిరాశానిస్పృహలకు గురి చేసేలా ఉండటం గమనార్హం.