Mexico-Texas Border : డాలర్ డ్రీమ్స్ : దొడ్డిమార్గంలో అమెరికాకి ..మెక్సికో – టెక్సాస్ సరిహద్దుకు భారతీయుల తాకిడి

దొడ్డిదారిన అమెరికా వెళ్లి అక్కడ లక్షలు సంపాదించాలనే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది.ఎన్ఆర్ఐ కలను సాకారం చేసుకోవడానికి దశాబ్ధం నాటి అక్రమ మార్గాన్ని వివరిస్తూ బాలీవుడ్ బాద్ షా ‘‘షారుఖ్ ఖాన్’’( Sharukh Khan ) తీసిన డాంకీ సినిమా ఈ ప్రక్రియను కళ్లకు కట్టినట్లుగా చూపింది.

 Illegal Immigration Viral Video Captures Indians Walking To Mexico Texas Border-TeluguStop.com

తాజాగా ఈ సినిమాను గుర్తుచేసేలా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.ఫుటేజ్‌లో ఇద్దరు యువ భారతీయులు మెక్సికో సరిహద్దు వైపుకు వెళ్తున్నారు.

హెచ్ 1 బీ వీసా, గ్రీన్‌కార్డ్ ( H1B Visa, Green Card )కోసం 100 ఏళ్లకు పైగా తాము నిరీక్షించలేమని వారు చెబుతున్నారు.

ఆ వీడియోలో ఎలాంటి భయం లేకుండా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమెరికా సరిహద్దును దాటడం సంతోషంగా వుందని వారు చెప్పారు.

తమ సహచరులు స్టూడెంట్ వీసా పొందడానికి కష్టపడి చదువుతున్నారని, ఆ తర్వాత వర్క్ వీసా పొందాలని, ఆపై గ్రీన్ కార్డ్ రావాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలని.వీటన్నింటితో పోలిస్తే చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించడం ఓ షార్ట్ కట్ అని వారిద్దరూ చెప్పారు.

ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టుల వంటి నిపుణులు వీసా( Visa ) ఆమోదం కోసం కనీసం 500 రోజుల నిరీక్షణను ఎదుర్కొంటున్నారు.కానీ ఇతరులు సరైన డాక్యుమెంటేషన్ లేకుండానే అమెరికాలో ప్రవేశించడానికి యూఎస్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్( US Immigration System ) ఓపెన్ బోర్డర్‌లోని లొసుగును ఉపయోగించుకుంటున్నారు.యూఎస్ ఇమ్మిగ్రేషన్ విధానంలోని లోపాలు చట్టవిరుద్ధమైన మార్గాలను అనుసరించే వారికి ప్రతికూలంగా, అక్రమ వలసలకు అనుకూలంగా వున్నట్లు పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.2011 నుంచి 70 శాతం పెరుగుదలతో అమెరికాలో నమోదుకాని వలసదారుల మూడవ అతిపెద్ద సమూహంగా భారతీయులు నిలవడం దురదృష్టకరం.

భారతీయ అమెరికన్ రచయిత వివేక్ వాధ్వా( Vivek Wadhwa ) ఈ పరిస్థితులపై విచారం వ్యక్తం చేశారు.యూఎస్ ఇమ్మిగ్రేషన్ స్థితి ఇలా వుందని .అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కనీసం పర్యాటక వీసాలు కూడా పొందలేరని, కానీ ఎవరైనా మెక్సికోకు ఫ్లైట్‌ని పట్టుకుని సరిహద్దుల మీదుగా అమెరికా రావొచ్చునని అక్కడ ఎలాంటి తనిఖీలు, వీసా ప్రాసెసింగ్ జాప్యాలు వుండవని వివేక్ దుయ్యబట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube