Red Cobra Video : ఎరుపు రంగు నాగుపామును ఎప్పుడైనా చూశారా.. వీడియో వైరల్..

రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఆన్‌లైన్ యూజర్ల దృష్టిని ఆకర్షించింది, ఇందులో నాగుపాము లాంటి ఒక ఎరుపు రంగు పాము( red snake ) కనిపించింది.రక్తపు రంగులో ఉన్న ఈ పామును చూస్తుంటే చాలా చిత్రంగా అనిపించింది.

 Red Cobra Video : ఎరుపు రంగు నాగుపామును -TeluguStop.com

సాధారణంగా పాములు నల్లగా, తెల్లగా లేదంటే బ్రౌన్ కలర్‌లో ఉంటాయి.కానీ ఈ పాము చాలా ఎర్రగా వెరైటీగా కనిపించింది.

వీడియోలో, ఒక వ్యక్తి ఈ ఎర్రటి పామును హ్యాండిల్ చేస్తూ కనిపించాడు, అది నాగుపాము వలే దాని పడగ విప్పి కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది.

ఈ వీడియోలో కనిపించిన పాము నిజంగా ఎర్రగానే ఉందా? ఇది అసలు పామేనా? లేదంటే ఫేక్ స్నేకా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.ఈ వీడియో యూజర్లలో చర్చనీయాంశమైంది.కొందరు ఇది నిజం కాదని అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు, ఈ వీడియో ఎడిటెడ్ అనుకుంటా అని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు.

ఏది ఏమైనప్పటికీ, ఈ వీడియోలోని ఎర్ర నాగుపాము, ఒక అసాధారణమైన దృశ్యంగా, మిస్టరీగా మిగిలిపోయింది.సోషల్ మీడియాలోని మరికొందరు క్రియేటర్స్ ఈ వీడియోను అలా కనిపించేలా చేసి ఉండొచ్చని అన్నారు.

ఒక వినియోగదారు ఎర్రటి నాగుపాముల ఉనికిని ధృవీకరిస్తూ అటువంటివి అరుదుగా కనిపిస్తాయని అన్నాడు.

ఈ పాము విలక్షణమైన రెడ్ స్పిట్టింగ్ కోబ్రా( Red Spitting Cobra ) అని తెలిపాడు.ఈ జాతి పాములు ఈజిప్ట్, టాంజానియా, ఉగాండా, సూడాన్‌లతో సహా అనేక ఆఫ్రికన్ ప్రాంతాలలో కనిపిస్తుంటాయి.ఈ రెడ్ స్పిట్టింగ్ కోబ్రా ఒక ప్రత్యేకమైన విషాన్ని ఉమ్మివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ లక్షణం ఇవి చాలా ఎలా క్రితమే అభివృద్ధి చేసుకొని ఉంటాయని భావిస్తున్నారు.ఈ నాగుపాము 8 అడుగుల దూరం నుంచి మానవుల కళ్ళలోకి కచ్చితంగా విషాన్ని ఉమ్మివేయగలవు.

అలాంటి పరిస్థితులలో ప్రాణాలకు చాలా ప్రమాదం.అందుకే వీటికి దూరంగా ఉండాలని చెబుతారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube