తెలంగాణలో రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు( Sridhar Babu ) అన్నారు.ఇందులో భాగంగానే ఇవాళ్టి నుంచి రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.
అలాగే త్వరలోనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ( Muthyampet Sugar Factory )ని పున: ప్రారంభిస్తామని పేర్కొన్నారు.గతంలోని బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే తమది ప్రజా ప్రభుత్వమన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రజా సంక్షేమం కోసం సర్కార్ పని చేస్తుందని వెల్లడించారు.