తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న అందరి చేత అన్నయ్య అని ముద్దుగా పిలిపించుకునే చిరంజీవి అంటే అభిమానించని నటులు ఉండరు.
ప్రేక్షకులతో పాటుగా సినిమా హీరోల్లో కూడా ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆయన యొక్క స్టార్ డమ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
![Telugu Chiranjeevi, Mahesh Babu, Mohan Babu, Nagarjuna, Prabhas, Rajamouli, Toll Telugu Chiranjeevi, Mahesh Babu, Mohan Babu, Nagarjuna, Prabhas, Rajamouli, Toll](https://telugustop.com/wp-content/uploads/2024/03/Are-these-the-star-heroes-who-are-supporting-Chiranjeevi-in-the-big-matter-of-the-industrya.jpg)
ఇక దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా చాలా సినిమాల సమస్యలను పరిష్కరిస్తూ చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి న్యాయం జరిగే విధంగా పలు రకాల చర్యలు అయితే తీసుకునేవాడు.ఇక మొత్తానికైతే ఆయన మరణం తర్వాత సినిమా ఇండస్ట్రీకి పెద్ద లేకపోవడంతో ఇక్కడ జరిగే చాలా విషయాల మీద ఎవరు స్పందించలేకపోతున్నారు.ఇండస్ట్రీలో ఒక పెద్ద అనేవారు ఉండాలి అనే విషయం మీద చాలా రోజుల నుంచి చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి.
ఒకపక్క చిరంజీవి( Chiranjeevi ) ఇండస్ట్రీ పెద్దగా ఉండబోతున్నాడు అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి.కానీ అంతలోనే మోహన్ బాబు( Mohan Babu ) నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండబోతున్నాను అంటు తనకు తాను ప్రచారం చేసుకున్నాడు.
![Telugu Chiranjeevi, Mahesh Babu, Mohan Babu, Nagarjuna, Prabhas, Rajamouli, Toll Telugu Chiranjeevi, Mahesh Babu, Mohan Babu, Nagarjuna, Prabhas, Rajamouli, Toll](https://telugustop.com/wp-content/uploads/2024/03/Are-these-the-star-heroes-who-are-supporting-Chiranjeevi-in-the-big-matter-of-the-industryc.jpg)
ఇక దాంతో చిరంజీవి కూడా ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండాల్సిన అవసరం లేదు.నాదాకా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని నేను సాల్వ్ చేస్తాను అంటూ తన ఓపెన్ గా చెప్పడం అప్పట్లో చిరంజీవి మోహన్ బాబు లా మధ్య ఇండస్ట్రీ పెద్ద కోసం జరిగిన వివాదం ముగిసిపోయేలా చేసింది… ఇక ప్రస్తుతం చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండాలంటూ ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, నాగార్జున ( Prabhas, Mahesh Babu, Rajamouli, Nagarjuna )లాంటి స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు చిరంజీవికి మద్దతుగా నిలుస్తున్నారు.మరి చిరంజీవి ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దగా ఇండస్ట్రీలో జరిగే సమస్యల పైన పోరాటం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.