Guntur Kaaram Sreeleela : గుంటూరు కారం మూవీ ఫ్లాపైనా శ్రీలీలకు ఆ విధంగా లాభమేనట.. అక్కడ క్రేజ్, ఇమేజ్ పెరిగిందా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం గుంటూరు కారం( Guntur Kaaram ). ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 Actress Sreeleela Craze With Guntur Kaaram Dance-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.కాగా గుంటూరు కారం సినిమా పేరు వినగానే గుర్తుకు వచ్చే పాట కుర్చీ మడత పెట్టి.

ఈ ఒక్క పాట యూటూబ్ లో సంచలనం క్రియేట్ చేయడంతో పాటు మారుమోగిపోయింది.ఇప్పటికీ ఎక్కడ చూసినా కూడా ఇదే పాటే ఎక్కువగా వినిపిస్తోంది.

అందులో డాన్స్ బీట్స్ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో కస్టపడి డాన్స్ బీట్స్( Mahesh babu Dance ) ఎక్కువగా చేసిన మూవీ గుంటూరు కారం అని చెప్పాలి.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Mass, Netflix, Sreeleela, Tollywood-Movie

హీరోయిన్ శ్రీ లీలా( Heroine Sreeleela ) మహేష్ బాబు ఈ పాటకు స్టెప్పులను ఇరగదీశారు.మాస్ డాన్స్ తో అదరగొట్టేశారు.కావాలని కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.శ్రీలీలతో పోటీపడి డాన్స్ చేయడానికి మహేష్ బాబు ఈ చిత్రంలో ప్రయత్నం చేశారు.ఆమె డాన్స్ టాలెంట్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు.ఈ మూవీలో రెండు సార్లు శ్రీలీల తన డాన్స్ టాలెంట్ ని చూపిస్తుంది.

ఇటీవల ఈ మూవీ ఓటీటీలో ఐదు భాషలలో రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్( Netflix ) లో ప్రస్తుతం గుంటూరు కారం మూవీ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

దానికి కారణం శ్రీలీల డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Mass, Netflix, Sreeleela, Tollywood-Movie

అలాగే ఫ్యామిలీ ఆడియన్స్( Family Audiance ) కి మూవీ కనెక్ట్ అయ్యింది.ఆదికేశవ, స్కంద, ఎక్స్ట్రార్డినరీ మెన్ సినిమాలతో మూడు డిజాస్టర్ లు గత ఏడాది ఆమె ఖాతాలో చేరాయి.భగవంత్ కేసరి హిట్ అయిన శ్రీలీలకి యాక్టింగ్ పరంగా ఆ మూవీ పేరు తీసుకొచ్చింది.

అయితే గుంటూరు కారం సినిమా ఏవరేజ్ అయిన కూడా శ్రీలీల క్రేజ్ అమాంతం పెంచేసిందని చెప్పాలి.ఇప్పటికే టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా నెంబర్ వన్ చైర్ వైపు ఈ బ్యూటీ దూసుకుపోతోంది.

గుంటూరు కారం సినిమా ఇప్పుడు ఇతర భాషలలో కూడా ఆమె క్రేజ్ ఇమేజ్ ని పెంచేసింది.ఫ్యూచర్ లో తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా శ్రీలీల స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) ఒకటి ఉంది.అలాగే రెండు, మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ మూవీలో శ్రీలీల హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యింది.సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ శ్రీలీల క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube