హీరోయిన్ పూనమ్ పాండే ( Poonam Pandey )వ్యవహారం దేశంలో సంచలనంగా మారింది.గర్భాశయ క్యాన్సర్( Cervical cancer ) కారణంగా తాను మరణించినట్లు తన సోషల్ మీడియా అధికారిక ఎకౌంటులో పోస్ట్ చేయడం తెలిసిందే.ఈ పోస్ట్ తో చాలామంది సిని లవర్స్ షాక్ అయ్యారు.32 సంవత్సరాలకే క్యాన్సర్ కారణంగా చనిపోవడం ఏమిటి అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు.ఇది అంతా ఓ పబ్లిక్ స్టంట్ అని ఈ రకంగానే పబ్లిసిటీ కోసం ఆమె వ్యవహరిస్తుందని కొంతమంది కామెంట్లు చేయడం జరిగింది.కానీ పూనమ్ పాండే మేనేజర్ సైతం ఆమె మరణ వార్తను దృవీకరించడం జరిగింది.
దీంతో శుక్రవారం ఈ వార్త సంచలనంగా మారింది.కానీ అనూహ్యంగా మరణ వార్త వచ్చిన తర్వాత రోజే పూనమ్ పాండే వీడియోలో ప్రత్యక్షమై తాను మరణించలేదని స్పష్టం చేసింది.
వీడియోలో నేను చనిపోలేదు బతికే ఉన్నాను అని చెప్పుకొచ్చింది.గర్భాశయ క్యాన్సర్ పైన అవగాహన కల్పించాలని సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తెలిపారు.ఇదే సమయంలో తన మరణ వార్తతో బాధపడిన.ఇబ్బంది పడిన వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్.పూనమ్ పాండే .ఆమె మేనేజర్ పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.“పూనమ్ పాండే గర్భాశయ కాన్సర్ తో మరణించారనే ఫేక్ న్యూస్.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అందరినీ ఆందోళనకు గురిచేసింది.పబ్లిసిటీ కోసం ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు.ఇది ఫేక్ అని తెలియడంతో పూనమ్ పాండేకు నివాళులర్పించిన వారి మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఫిర్యాదులో పేర్కొన్నారు