ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తూ ఉన్నాయి.రూ.20 వేల బడ్జెట్లో దొరికే 5జీ స్మార్ట్ ఫోన్లు( 5G smart phones ) ఏవో చూద్దాం.
మోటోరోలా జీ54 5జీ స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్( Moto G54 5g: ) 6.5 అంగుళాల ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ ప్లే తో ఉంటుంది.12GB RAM+256GB ఇంటర్నల్ మెమరీ తో ఉంటుంది.ఈ ఫోన్ వెనుక వైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీ సామర్థ్యంతో 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.15999 గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F34 5జీ స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే తో ఉంటుంది.1000 నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది.50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైట్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ తో ఉంటుంది.సెల్ఫీల కోసం ముందువైపు 13 ఎంపీ సెల్ఫీ కెమెరా( 13 MP selfie camera )తో ఉంటుంది.8GB RAM+ 128GB స్టోరేజ్ తో ఉంటుంది.ఎక్సినొస్ 1280ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది.
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.17999 గా ఉంది.
మోటోరోలా జీ84 5జీ స్మార్ట్ ఫోన్:
10-బిట్ కలర్ డెప్త్ తో 6.5 అంగుళాల ఫుల్ HD ప్లస్ పీఓ LED డిస్ ప్లే తో ఉంటుంది.12GB RAM+256GB స్టోరేజ్ తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.50 ఎంపీ ప్రైమరీ కెమెరా, ఆటో ఫోకస్ 8ఎంపీ అల్ట్రా వైట్ కెమెరా, సెల్ఫీల కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరాతో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.18999 గా ఉంది.
లావా అగ్ని 2 5జీ:
10-బిట్ కలర్ డెప్త్ తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ ప్లే తో ఉంటుంది.8GB RAM+256GB స్టోరేజ్ తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ 4700 mAh బ్యాటరీ సామర్థ్యం తో 66వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్, 2mp డెప్త్ సెన్సార్ తో ఉంటుంది.సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.19999 గా ఉంది.