బీహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ నెలకొంది.ఇండియా కూటమిలో( India Alliance ) భాగంగా ఉన్న సీఎం నితీశ్ కుమార్( CM Nitish Kumar ) ఆర్జేడీ, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీకి( BJP ) మద్ధతు తెలపనున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నితీశ్ కుమార్ యోచనలో ఉన్నారని సమాచారం.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమికి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.
ఇండియా కూటమి కన్వీనర్ పోస్టు ఇవ్వకపోవడంతో పాటు కాంగ్రెస్ సీట్ల సర్దుబాటులో జాప్యం జరగడంతో నితీశ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.మరోవైపు నితీశ్ నిర్ణయంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్( Akhilesh Yadav ) స్పందించారు.నితీశ్ కు ప్రధాని అభ్యర్థిగా అవకాశం ఇవ్వాల్సిందన్నారు.ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నితీశ్ పీఎం అయ్యేవారేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు.