ప్రియాంక అరుల్ మోహన్( Priyanka Arul Mohan ).ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా గ్యాంగ్ లీడర్.
ఈ సినిమాలో హీరోయిన్గా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ.నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం చిత్రాల్లో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించింది.
ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.తమిళంలో మంచి అవకాశాలే వస్తున్నప్పటికీ, తెలుగులో మాత్రం ప్రియాంక అరుల్ మోహన్‌కు హీరోయిన్‌గా అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి.
తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఈమె సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఈమె తరుచూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు( Glamorous Photos ) షేర్ చేస్తూనే ఉంటుంది.అందులో భాగంగానే తాజాగా ఈ ముద్దుగుమ్మ.తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను పంచుకుంది.ఆ ఫోటోల్లో బూడిద రంగు చీరలో మెరిసిపోతోంది.ఆ చీరలో ప్రియాంక మరింత అందగా కనిపిస్తోంది.ఆ ఫోటోలు చూసిన వీడియోలు చాలా మంది ఆ చీర అద్భుతంగా ఉందని ఆ చీర గురించి సోషల్ మీడియాలో వెతకగా ఆ చీర రంగు ఖరీదు తెలిసి షాక్ అవుతున్నారు.
ఈ చీర ఖరీదు అక్షరాల 5,29,900 రూపాయలు. దీంతో ఇదేంది సామి ఒక్క చీర ఖరీదు ఐదు లక్షలా అంటూ నోరెళ్లబెడుతున్నారు నెటిజన్స్.
వామ్మో అంటూ చాలామంది షాక్ అవుతున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారాయి.ఇకపోతే ప్రియాంక సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం ఈమె తెలుగులో సరిపోదా శనివారం( Saripodha Sanivaram ) అనే సినిమాలో నటిస్తోంది.
ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్‌గా జరిగాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరుల్ మోహన్ కాస్త లావుగా కనిపించేసరికి ఈమె పై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.
ప్రస్తుతం తమిళంలో వరుస సక్సెస్ లతో ఫుల్ దూకుడు మీదున్న ఈ భామ తెలుగులో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో నటిస్తోంది.