తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో( Jabardast Comedy Show ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అంతేకాకుండా ఎంతోమందికి జబర్దస్త్ లైఫ్ ని ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.మారుమూలు ఉన్న టాలెంట్ ను వెండితెరకు పరిచయం చేసిన షో.సామాన్యులను సెలబ్రిటీలను( Celebrities ) చేసి పేదరికంలో మగ్గుతున్న టాలెంట్ ను కార్లలో తిరిగేలా చేసింది జబర్థస్త్.అంతేకాకుండా జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారు ప్రస్తుతం వెండితెరపై వరుసగా అవకాశాలను అందుకొంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
జబర్దస్త్ ద్వారా సెలబ్రిటీ హోదాను దక్కించుకున్న వారిలో కమెడియన్ రాజమౌళి( Comedian Rajamouli ) కూడా ఒకరు.తాగుబోతు పాత్రకు పెట్టింది పేరైన రాజమౌళి.తాగకపోయినా కూడా అచ్చం తాగిన వారిలాగే యాక్ట్ చేస్తూ తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బనవిస్తూ ఉంటారు రాజమౌళి.ఇది ఇలా ఉంటే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోనా మహమ్మారి సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.మాది చాలా మారుమూల పల్లెటూరు.అందువల్ల చిన్నప్పటి నుంచి తాగుబోతులను చాలా దగ్గరగా చూశాను.
ఆ సమయంలో వాళ్లు ఎలా మాట్లాడతారు.ఎలా ప్రవర్తిస్తారు అనేది నాకు బాగా తెలుసు.అందుకే ఈ పాత్రలు పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాను అని తెలిపారు.ఇక నటన అనేది మా ఇంట్లోనే ఉంది.అప్పట్లో మా నాన్న డ్రామాలు ఎక్కువగా వేసేవారు.ఆ డ్రామాలను చూస్తూ ఉండటం వలన నాకు నటన పట్ల ఆసక్తి ఏర్పడింది.
కాలేజ్ రోజులకి వచ్చేసరికినటిస్తూ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాను అన్నాడు.అయితే నటుడిగా నా కెరియర్ మొదలుపెట్టిన తరువాత నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు అని చెప్పుకొచ్చారు రాజమౌళి.
కానీ కరోనా సమయంలో అనారోగ్యంతో బాగా ఇబ్బందులు ఫేస్ చేశాను.నాకు కరోనా వచ్చింది.
అది కూడా చాలా సీరియస్ అయింది.ఆ సమయంలో హాస్పిటల్లో చేర్చడం వలన చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయింది.
నేను చనిపోతాననే అంతా అనుకున్నారు.అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డాను.
ఇది నాకు పునర్జన్మ అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు రాజమౌళి.ఈ సందర్భంగా రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.